తెలంగాణ

‘సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: సామాజిక న్యాయం కేవలం తమ పార్టీతోనే సాధ్యమని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. దేశంలో సామాజిక న్యాయం చేసి అన్ని వర్గాలకు సమాన న్యాయం అందించే విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుంటుందని ఆయన తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం గాంధీ భవన్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి అంబేద్కర్ చిత్ర పటానికి పూల దండ వేసి నివాళి అర్పించారు. పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు నివాళి అర్పించారు. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ అంబేద్కర్ ప్రపంచ మేధావు అని కొనియాడారు. అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాల ప్రయోజనాల కోసం తన శక్తినంతా దారపోసి పని చేశారని, ఆ సేవల వల్లనే బడుగు, బలహీనవర్గాలు రిజర్వేషన్లు పొందుతున్నాయని ఆయన తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి న్యాయ శాఖ మంత్రిగా అంబేద్కర్‌కు అవకాశం కల్పించిందని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా రాజ్యాంగ రచన సంఘానికీ చైర్మన్‌గా చేసిందని ఆయన చెప్పారు. ఇలాఉండగా ఈ నెల 9న ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జిల్లా, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆయన సూచించారు.

జాతీయ టాస్క్ఫోర్స్‌లో తెలంగాణ అధికారులు

హైదరాబాద్, డిసెంబర్ 6: ఓఇసిడి (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్) విత్తన పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ఫోర్స్‌లో తెలంగాణకు చెందిన ఇద్దరు అధికారులకు చోటు లభించింది. రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి పార్థసారథిని ఈ టాస్క్ఫోర్స్‌కు కో-చైర్మన్‌గా నియమించారు. స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్ట్ఫికేషన్ ఏజన్సీ డైరెక్టర్ డాక్టర్ కె. కేశవులును సభ్యుడిగా నియమించారు. ఈ టాస్క్ఫోర్స్‌కు చైర్మన్‌గా కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ (సీడ్స్) డాక్టర్ బి. రాజేందర్ నియామకం అయ్యారు. మరో ఎనినిమిది మంది అధికారులను సభ్యులుగా నియమిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ పబ్‌లపై ఎక్సైజ్ శాఖ సీరియస్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 6: హైదరాబాద్‌లో పబ్‌ల నిర్వహణను ఎక్సైజ్ శాఖ సీరియస్‌గా తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్‌లు నిర్వహిస్తున్నారని, మైనర్లకు మందు సరఫరాతోపాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో గత రెండు రోజులుగా పబ్‌లపై దాడులు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని రోడ్డు నెం. 10,12,36లోని పబ్‌లపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినట్టు ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ తెలిపారు. 31క్లబ్‌లపై 168 కేసులు నమోదు చేశామని, కాఫీ షాపుల పేరుతో హుక్కా కేంద్రాలు నడుపుతున్న పబ్‌లపై కూడా కేసులు నమోదు చేసినట్టు ఎక్సైజ్ కమిషనర్ తెలిపారు. కొన్ని బార్లల్లో మైనర్లకు మందు సరఫరా చేస్తున్నట్టు ఫిర్యాదులు అందినట్టు కమిషనర్ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొన్ని పబ్‌ల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, పబ్‌లకు తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, బార్ అండ్ రెస్టారెంట్లకు మాత్రమే అనుమతించామని కమిషనర్ పేర్కొన్నారు.

తెలుగు మహాసభల కమిటీల ఏర్పాటు

హైదరాబాద్, డిసెంబర్ 6: తెలంగాణ ప్రభుత్వం ప్రతిషాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల కోసం మరి కొన్ని కమిటీలను ఏర్పాటు చేసింది. వివిధ కార్యక్రమాల నిర్వహణలో ఈ కమిటీలు కీలకపాత్ర పోషించనున్నాయి. భాషా సదస్సుల కమిటీ, గేయతత్వ కమిటీ, అవధాన కమిటీ, మహిళా సాహిత్య కమిటీ, బాల సాహిత్య కమిటీ, చరిత్ర కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు.
మహిళాసాహిత్య కమిటీలో శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి, సొర్యాధనంజయ్,జూపాక సుభద్ర, అనిశెట్టి రజిత, వేలూరి శ్రీదేవి, కడిమిళ్ల లావణ్య, ఆచార్య త్రివేణి, షాజహాన, జ్వలిత, చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ, బండారు సుజాత శేఖర్, నెల్లుట్ల రమాదేవి, కొండపల్లి నీహారిణిని నియమించారు.
బాలసాహిత్య కమిటీలో ఎం చిత్తరంజన్, ఐతా చంద్రయ్య, వేదాంతం సూరి, వాసాల నర్సయ్య, డాక్టర్ పత్తిపాక మోహన్, వేదకుమార్, దాసరి వెంకటరమణ, విఆర్ శర్మను నియమించారు.
చరిత్ర కమిటీలో ఘంటా చక్రపాణి, డాక్టర్ డి.రాజారెడ్డి, డాక్టర్ ధ్యావనపల్లి సత్యనారాయణ, అడపా సత్యనారాయణ, హరగోపాల్, కుర్రా జితేంద్రబాబు, కావూరి శ్రీనివాస్, మల్లేపల్లి లక్ష్మయ్యను నియమించారు.
అవధాన కమిటీలో అష్టకాల నరసింహ రామశర్మ, గౌరీభట్ల మెట్రామ శర్మ, బెజుగామ రామమూర్తి, ముదిగొండ అమర్‌నాథ్ శర్మ, ఆచార్య రావికంటి వసునందన్, మల్గ అంజయ్య, తిగుళ్ల శ్రీహరి శర్మ, ఎం.హరిదాసు, సాగి కమలాకర శర్మ, ముద్దు రాజయ్యను నియమించారు.
భాషా సదస్సుల కమిటీలో భాషా సదస్సుల కమిటీలో ఆచార్య రవ్వా శ్రీహరి, కపిలవాయి లింగమూర్తి, కె. రామచంద్రమూర్తి, కె. శ్రీనివాస్, కట్టా శేఖర్ రెడ్డి, అల్లం నారాయణ, వర్దెల్లి మురళి, డాక్టర్ సలిమెల భాస్కర్, డాక్టర్ మలయశ్రీ, డాక్టర్ వెల్చాల కొండల రావును నియమించారు.
గేయతత్వ కీర్తనల కమిటీలో తిరుమల శ్రీనివాసాచార్య, పి. భాస్కర యోగి, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, కందికొండ, చెన్నకేశవ రెడ్డి, వడ్డెపల్లి కృష్ణ, వారిజా రాణి, శ్రేష్టను నియమించారు.
కాగా ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కార్టూన్ల ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు నందిని సిధారెడ్డి తెలిపారు. ఈ ప్రదర్శనకు ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు భాష, తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక, పండుగల, సామెతల ఆధారంగా అనుకూలంగా ఉండే కార్టూన్లను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.
ఈ ప్రదర్శన నిర్వాహకులుగా కార్టూనిస్టులు మృత్యుంజయ్, శంకర్, నర్సింలను వ్యవహరిస్తారు. కార్టూనిస్టులు ఏ3 సైజులు మాత్రమే వేయాలి. ఈ నెల 10వ తేదీలోగా తీఆౄఒష్ఘూఆ్య్యశ ఘౄజ.ష్యౄ కు ఫంపాలి. కార్టూన్‌తో పాటు మీ ఊరు, జిల్లా పేరు, ఫోన్ నంబర్ రాసి హామీ పత్రం జత చేసి పంపాలి.

దళితుల ఎదుగుదలకు దోహదపడింది టీడీపీయే: మోత్కుపల్లి

హైదరాబాద్, డిసెంబర్ 6: దళితుల ఎదుగుదల, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, వారి అభ్యున్నతికి దోహదపడింది తెలుగు దేశం పార్టీ మాత్రమేనని ఆ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపర్చిన రిజర్వేషన్లనే ఇప్పటికీ అమలు చేస్తున్నారు తప్ప ఏ ప్రభుత్వం అదనంగా చేయడం లేదని అన్నారు. అంబేద్కర్ ఆలోచన ప్రకారం దళితుల మనసులో ఏముందో దానిని అమలు చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు. బుధవారం నాడిక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 61వ వర్ధంతి కార్యక్రమం టిటిడిపి టిఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోత్కుపల్లి తదితరులు అంబేద్కర్ చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో గురుకుల విద్యాలయాలు పని చేస్తున్నాయంటే అది ఎన్టీఆర్ ఘనతేనని అన్నారు. ఎన్టీఆర్‌కు తాను చెప్పిన వెంటనే 46 గురుకులాలను ఏర్పాటు చేశారని, ఆ తర్వాత చంద్రబాబునాయుడు సమర్ధవంతంగా వాటిని అమలు చేశారని అన్నారు.
వ్యవసాయ కమిషన్ ఏర్పాటు ఏది?: చాడ

హైదరాబాద్, డిసెంబర్ 6: రాష్ట్రంలో వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి చివాట్లు పెట్టినా ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. రుణమాఫీ వడ్డీని మూడు రోజుల్లో చెల్లిస్తామని శాసనసభలో సిఎం కెసిఆర్ ప్రకటించి ఇంతవరకు చెల్లించలేదని అన్నారు. మరో వైపు రైతులకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయని చెప్పారు. కేంద్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపి అజీజ్ పాషా, సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మల్లేశ్, పద్మ తదితరులతో కలిసి చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి హడ్కో మంజూరు చేసిన రుణం తొలి దఫా విడుదల చేసిన రూ.1600 కోట్లలో 300 కోట్లను మాత్రమే డబుల్ బెడ్‌రూం ఇళ్లకు వినియోగించి మిగిలిన నిధులను ప్రభుత్వం దారిమళ్లించిందని ఆరోపించారు.

సీబీఐటీలో ఫీజుల దందా ఫీజులు కట్టేది లేదని తేల్చిన విద్యార్థులు

హైదరాబాద్, డిసెంబర్ 6: ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజీ సిబిఐటి యాజమాన్యం భారీగా ఫీజులు పెంచిందంటూ గండిపేటలోని కాలేజీ ప్రాంగణంలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. రూ. 1.13 లక్షల రూపాయిలు ఉన్న ఫీజులను ఒక్కసారిగా రెండు లక్షలకు పెంచడంతో తమ చదువులు ఆగిపోయేలా ఉన్నాయంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి, రెండో సంవత్సరం విద్యార్ధులు ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని ఒత్తిడి చేస్తున్నారని వారు ఆరోపించారు. వందలాది మంది విద్యార్ధులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేయడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా ఫీజుల పెంపు విషయాన్ని విద్యార్థులకు ముందుగానే సమాచారం ఇచ్చామని ప్రిన్సిపాల్ రవీందర్‌రెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి మాత్రమే ఫీజులను పెంచడం జరిగిందని ఆయన అన్నారు. కాలేజీలో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఫీజులు పెంచక తప్పడం లేదని అన్నారు. ఫీజు పెంపు గురించి కౌనె్సలింగ్ సమయంలోనే విద్యార్థులకు తెలియజేశామని ఆయన వివరించారు. యాజమాన్యం ఫీజుల దందాను భరించలేమని విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా పలు వర్శిటీల విద్యార్థులు బాసటగా నిలిచారు.

అంబేద్కర్ అంటే అంత చులకనా? ప్రశ్నించిన వీహెచ్

హైదరాబాద్, డిసెంబర్ 6: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు అంత చులకనా? అని ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపి వి. హనుమంత రావు ప్రశ్నించారు. అంబేద్కర్ వర్ధంతిని కర్నాటక ముఖ్యమంత్రి అధికారికంగా ఘనంగా నిర్వహించారని ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు.

టీచర్లు బడికి పోరంటే ఎలా? మంత్రిపై మండిపడ్డ ఉపాధ్యాయ సంఘాలు

హైదరాబాద్, డిసెంబర్ 6: ఉపాధ్యాయులు బడికి పోవడం లేదని ఐటి మంత్రి కె తారకరామారావు చేసిన వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడ్డారు. టిఎస్‌యుటిఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు ఎ నర్సిరెడ్డి, చావ రవి, తెలంగాణ ఎస్టీయు నేతలు బి భుజంగరావు,జి సదానందగౌడ్‌లు వేర్వేరు ప్రకటనల్లో మంత్రి ప్రకటనలను ఖండించారు. ఉపాధ్యాయులు బడికి పోరంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు సరికావని చావ రవి అన్నారు. బాధ్యతాయుత వ్యక్తులు చేయాల్సిన వ్యాఖ్యలు కావని అన్నారు. ఇటీవల ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేస్తున్న సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ 95 శాతం మంది టీచర్లు సక్రమంగా పనిచేస్తున్నారని అన్నారని, మిగిలిన వారు కూడా సక్రమంగా పనిచేయాలని సూచించారని వారు గుర్తుచేశారు.

టీఆర్‌ఎస్ ప్లీనరీ పేరుతో నిధుల వసూళ్లపై 13లోగా వివరాలు ఇవ్వండి

హైదరాబాద్, డిసెంబర్ 6: టిఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల నిమిత్తం మంత్రులు ప్రజల నుంచి నిదులను వసూళ్లు చేయడంపై కేసునమోదు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇచ్చిన దరఖాస్తుపై పూర్తి వివరాలు తమకు ఈ నెల 13వ తేదీలోగా అందించాలని హైకోర్టు తెలంగాణ అవినీతి నిరోధక శాఖను ఆదేశించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన టిఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశానికి మంత్రులు రకరకాల పనులు చేసి ప్రజల నుంచి నిధులు వసూలు చేయడం అక్రమమని, దీనిపై ఎసిబికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వి భట్ విచారించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సివి మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో పిటిషనర్ రేవంత్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీన అవినీతి నిరోధక శాఖకు దరఖాస్తు ఇచ్చారన్నారు.
కాని ఇంతవరకు ఈ దరఖాస్తుపై ఏసిబి ఎటువంటి చర్యలు తీసుకోలేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జోక్యం చేసుకుని ఈ దరఖాస్తును చూసి దీనిపై తేదీ లేదని, ఏ ప్రాతిపదికన ఏసిబి ఆగస్టు 31వ తేదీన దరఖాస్తు స్వీకరించిందని చెప్పగలరని న్యాయవాదిని ప్రశ్నించారు. తమకు ఏసిబి నుంచి దరఖాస్తు స్వీకరించినట్లు నిర్ధారించిందని, ఈ మేరకు సమాచారం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుని, అక్‌నాలెడ్జ్‌మెంట్ పైన ఆగస్టు 8వ తేదీ అని ఉన్నట్లు చెప్పారు.పిటిషన్‌కు జతపరిచిన ఫోటోగ్రాఫ్స్‌ను న్యాయమూర్తి పరిశీలించారు. ఈఫోటోల్లో మంత్రులు ఐస్‌క్రీమ్ అమ్మకందార్లు, హమాలి, టీ అమ్మకం దార్లు, సేల్స్‌మెన్‌గా పని చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. గులాబీ కూలీ కోసం ఈ పనిచేసినట్లు న్యాయవాది కోర్టుకు తెలిమపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుని, ఈ ఫోటోల్లో మంత్రులు డబ్బులు స్వీకరిస్తున్నట్లు ఎక్కడాలేదని పేర్కొన్నారు. అనంతరం న్యాయవాది సివి మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ రేవంత్ రెడ్డి ఆగస్టు 3వ తేదీన దరఖాస్తును ఇచ్చి ఉండవచ్చని పేర్కొంటూ, మంత్రులు ప్లీనరీ కోసమని డబ్బు వసూలుల చేయడం అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7,11,13 కిందకు వస్తందని, ఐపిసి 120బి సెక్షన్ కింద ఇది నేరమని పేర్కొన్నారు.
ఏసిబి తరఫున న్యాయవాది రవి కిరణ్ కోర్టుకు హాజరయ్యారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వి భట్ జోక్యం చేసుకుని, రేవంత్ రెడ్డి ఇచ్చిన దరఖాస్తు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏ తేదీన స్వీకరించిన అంశంపై పూర్తి వివరాలను కోర్టుకు ఈ నెల 13వ తేదీలోగా తెలియచేయాలని ఆదేశించారు.