తెలంగాణ

‘కార్పొరేట్’ ఒత్తిళ్లే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 8: కార్పోరేట్ విద్యాసంస్థల ఒత్తిళ్ల కారణంగానే విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఇది బాధాకరమైన అంశమని వీటిపై పాలకులు, మేధావులు, సమాజం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని జడ్పీ మైదానంలో పిడిఎస్‌యు 21వ రాష్ట్ర మహాసభలు ప్రారంభం అయ్యాయి. ఈ మహాసభలను పురస్కరించుకుని రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన పిడిఎస్‌యు ప్రతినిధులు, విద్యార్థులు భారీగా తరలివచ్చారు. మహబూబ్‌నగర్ పట్టణంలో నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని విద్యార్థులు ఎర్రజెండాలను పట్టుకుని కదం తొక్కారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు రాష్ట్ర మహాసభల ప్రారంభోత్సవ సభకు ముఖ్యఅతిథిగా జేఏసీ చైర్మన్ కోదండరాం హజరయ్యారు. ఈ మహాసభలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు విద్యార్థుల హక్కుల కోసం, సమాజహితం కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతెనా ఉందన్నారు. ప్రపంచం ఓ కుగ్రామంగా మారిందని ఈ నేపథ్యంలో పోటీతత్వం పెరిగిపోయిందన్నారు. ముఖ్యంగా ప్రపంచంలో ఏది చేయాలన్న ఏది సాధించాలన్న పోటీ పడాల్సివస్తుందని అందులో ప్రధానంగా విద్యావ్యవస్థ కూడా ఓ పోటీ ప్రపంచంలా మారిందన్నారు. దీనిని తట్టుకోవడానికి విద్యార్థిలోకం ఎంతో శ్రమించాల్సి వస్తుందని అందులో కొందరు విద్యార్థులు తమ ప్రాణాలను ఉరికొయ్యలపైకి ఎక్కిస్తున్నారన్నారు. ఇందుకు కారణం పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలేనని ఆయన ఆరోపించారు.
కార్పొరేట్ విద్యాసంస్థలు సంపాదనే ధ్యేయంగా విద్యను ఓ వ్యాపారంగా మల్చుకుని ప్రభుత్వాలనే శాసించేస్థాయికి ఎదిగాయన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వాలు సైతం వత్తాసు పలుకుతూ జైకొడుతున్నారన్నారు. విద్యతో పాటు విద్యార్థులకు ఆటపాటలు కూడా ఎంతో అవసరమని ఈ విషయాన్ని అందరూ మరచిపోతున్నారని ఇది బాధాకరంగా భావిస్తున్నానని తెలిపారు. ఎంత చదువుకున్నా ఆరోగ్యంగా లేకపోతే మనిషి జీవితం వ్యర్థమేనని ఓ పక్క శారీరక దృఢత్వం, మరోవైపు చదువు ఉంటేనే భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించగలుతారన్నారు. అందుకే ఈ రాష్ట్ర మహాసభల ద్వారా విద్యార్థులకు ఓ పిలుపునిస్తున్నామని చదువు ఎంత ముఖ్యమో చదువుపూర్తి అయిన తర్వాత ఉపాధి కల్పించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆ దిశగా విద్యార్థులు అడుగులు వేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక వసతులు లేక 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40శాతం బాలబాలికలు విద్యకు దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వాలు, పాలకులు ప్రైమరీ ఎడ్యుకేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించినప్పుడే అట్టడుగు వర్గాల పేదపిల్లలు చదువుకుంటారని అన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వ విధానాలే అని ఆరోపించారు. ఇటివల జే ఏసీ ఆధ్వర్యంలో కొలువుల కోట్లాట సభ బ్రహ్మాండంగా నిర్వహించామని దాంతో ప్రభుత్వానికి కూడా నిరుద్యోగులు, చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులు ఓ హెచ్చరిస్తూనే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారని కోదండరాం వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర ఉద్యోగ నియమాకాలపై ఓ విధానం అంటూ లేదని ఆసలు ఏ డిపార్ట్‌మెంట్‌లో ఏవిధంగా ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తారో బహిరంగంగా ఓ క్యాలెండర్‌లో విడుదల చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఈ మహాసభలో జిల్లా జే ఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు రాము, వెంకట్, జ్యోతి, స్వప్న, అంబాదాస్, సరిత పాల్గొన్నారు.