తెలంగాణ

హింసను విడనాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని, ప్రజాస్వామ్యయుతంగా పోరుసాగించాలని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ ఎన్‌ఎండిసి స్వర్ణోత్సవ వేడుకలను శుక్రవారం నాడు ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వామపక్షం తీవ్రవాదం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న చత్తీస్‌గడ్‌లోని మారుమూల వెనుకబడిని ప్రాంతాల్లో ఎన్‌ఎండిసి కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలను చేపట్టడం ఎంతైనా అభినందనీయమని అన్నారు. దంతేవాడలో బలహీన వర్గాల వారి పిల్లలకు 18వేల ఉపకార వేతనాలు అందించడం, మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలను సమకూర్చడం వంటి కార్యక్రమాలను ఇతర సంస్థ కూడా అనుసరించదగిన రీతిలో ఉన్నాయని అన్నారు. ఒక స్థిరమైన పారిశ్రామిక పునాదిని నిర్మించడంలోనూ, పలు రంగాల్లో సాంకేతిక సామర్ధ్యాన్ని విస్తరించడంలోనూ, ప్రభుత్వ రంగ సంస్థలు దేశానికి తోడ్పాటు అందించాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 4293 ఓకట్ల రూపాయిల మేర పన్ను చెల్లింపునకు ముందస్తు లాభాన్ని ఆర్జించిన , దేశంలో కెల్లా అతి పెద్ద ఇనుపఖనిజం తవ్వకాల కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. ఎన్‌ఎండిసి చత్తీస్‌గడ్ బస్తార్ ప్రాంతంలోనూ గని తవ్వకాలు మొదలుపెట్టి అక్కడి ఆదివాసీ ప్రజలకు ఉపాధి కల్పనకు కృషి చేయడం ద్వారా వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చిందని ప్రశంసించారు. గత ఐదేళ్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలకు 798 కోట్ల రూపాయిలను ఖర్చు చేసిందని అన్నారు. ఇనుప ఖనిజం వేర్వేరు గ్రేడ్లను వినియోగించుకుంటూ గని తవ్వకాల్లో జీరో వేస్ట్ దిశగా కృషి చేస్తున్నందుకు ఉప రాష్టప్రతి ఎన్‌ఎండిసిని అభినందించారు. ఎన్‌ఎండిసి కృషితో చత్తీస్‌గడ్‌లో వెనుకబడిన ప్రాంతాలు ఆర్ధికంగా వర్ధిల్లాయని కేంద్ర ఉక్కు మంత్రి చౌదరి బీరేందర్‌సింగ్ అన్నారు. పరిశ్రమ 8 శాతం నుండి 10 శాతం వృద్ధిని నమోదుచేయనున్న ప్రస్తుత స్థితిలో భారతదేశం త్వరలోనే ఉక్కు ఎగుమతి స్థాయికి చేరుకుంటుందని చెప్పారు. గని తవ్వకం కార్యకలాపాలు పర్యావరణానికి చేటు తెస్తాయనే విశ్వాసానికి భిన్నంగా ఎన్‌ఎండిసి పర్యావరణ మిత్రగా వ్యవహరిస్తోందని భూ శాస్త్రాల శాఖ సహాయ మంత్రి వై ఎస్ చౌదరి అన్నారు. ఉక్కు సహాయ మంత్రి విష్ణుదేవ్ సాయి, చత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ , ఉక్కు శాఖ కార్యదర్శి అరుణా శర్మలు కూడా మాట్లాడారు. అంతకు ముందు ఉప రాష్టప్రతి ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన డ్యాష్ బోర్డును ప్రారంభించారు. ఉత్తమ సమీకృత ఉక్కు కర్మాగారానికి ఇచ్చే ప్రధానమంత్రి ట్రోఫీని 2014-15 సంవత్సరానికి, 2015-16కు గానూ టాటా స్టీల్‌కు దక్కింది. ఉక్కుమంత్రి ట్రోఫీని విజయనగర్‌లోని జెఎస్‌డబ్ల్యు స్టీల్ లిమిటెడ్‌కు దక్కింది. గరిష్టస్థాయిలో వృద్ధిని నమోదు చేసినందుకు జిందాల్ స్టీల్ ప్లాంట్‌కు, ద్వితీయ బహుమతి విశాఖ రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్‌కు దక్కాయి. స్వర్ణోత్సవ అధికార చిహ్నాన్ని, తపాలా బిళ్లను ఆవిష్కరించారు.
ఘనంగా వీడ్కోలు
రెండు రోజుల పర్యటన ముగించుకుని హైదరాబాద్ నుండి బయలుదేరిన ఉప రాష్టప్రతికి బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్ ఘనవీడ్కోలు పలికారు. బేగంపేట నుండి ఉప రాష్టప్రతి రేణిగుంటకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మండలి చైర్మన్ కె స్వామిగౌడ్, జిఎడి ముఖ్యకార్యదర్శి అదర్‌సిన్హా, అదనపు డిజిపి అంజనీ కుమార్, జాయింట్ సిపి రవీందర్, హైదరాబాద్ కలెక్టర్ తదితరులున్నారు.
చిత్రం..హైదరాబాద్‌లో శుక్రవారం ఎన్‌ఎండిసి స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉప రాష్టప్రతి