తెలంగాణ

మరో అనాథ చిన్నారికి అమెరికన్ అమ్మఒడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 8: నల్లగొండ శిశుగృహ నుండి మరో అనాథ చిన్నారికి అమెరికన్ అమ్మఒడి ఆసరా దక్కింది. ఇటీవల డెన్మార్క్‌కు చెందిన మార్టిన్, అమెరికా కాలిఫోర్నియాకు చెందిన కార్మెన్ అలురేజ్‌లు చెరొక అనాథ ఆడశిశవులను దత్తత తీసుకుని వెళ్లారు. ఇదే పద్ధతిలో అమెరికా టెనె్నస్సీకి చెందిన మరో అమెరికన్ వనిత నెల్లా కాన్‌ఫీల్డ్ మరో అనాథ చిన్నారిని దత్తతకు తీసుకోవడం విశేషం. ఆన్‌లైన్ ద్వారా చిన్నారి దత్తతకు దరఖాస్తు చేసుకున్న కాన్‌ఫీల్డ్‌కు దత్తత అనుమతి లభించింది. దీంతో ఆమె చిన్నారిని తీసుకెళ్లేందుకు శుక్రవారం శిశుగృహకు వచ్చి వర్ష(14నెలలు) చిన్నారిని దత్తత తీసుకుంది. అమ్మతనం, అమ్మ పిలుపు కోసం ఖండాంతరాలు, దేశాల సరిహద్ధు దాటి వచ్చిన కాన్‌ఫీల్డ్ తన దత్తత చిన్నారిని వర్షను చూడగానే ఆప్యాయంగా ఎత్తుకుని లాలించి మురిసిపోయింది. నెల రోజుల వ్యవధిలో శిశుగృహకు చెందిన ముగ్గురు అనాథ చిన్నారులకు విదేశీ మహిళల అమ్మఒడి దక్కడంతో వారికి మెరుగైన జీవితం, అమ్మప్రేమ లభించినట్లయ్యింది.

చిత్రం..నల్లగొండ శిశుగృహ అనాథ చిన్నారిని దత్తత తీసుకుని
అమ్మప్రేమ తన్మయత్వంతో మురిసిపోతున్న అమెరికన్ వనిత నెల్లా కాన్‌ఫీల్డ్