తెలంగాణ

చర్లగూడెం ప్రాజెక్టు పనులకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిగూడ, డిసెంబర్ 8: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మండలంలోని శివన్నగూడెం గ్రామ శివారులో నిర్మిస్తున్న చర్లగూడెం ప్రాజెక్టు పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ముంపు గ్రామాల ప్రజలు వంద రోజులకు పైగా శాంతియుతంగా నిరవధికంగా ధర్నాను కొనసాగించారు. సోమవారం పోలీసుల లాఠీచార్జి, భూ నిర్వాసితుల ప్రతిఘటన నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీయం, బీజేపీ, టీడీపీలు నిర్వాసితులకు మద్దతుగా నిలబడి ఆందోళనను ఉద్ధృతం చేశాయి. పోలీస్ బలగాల పహారాలో కొనసాగుతున్న చర్లగూడెం రిజర్వాయర్ పనులను ఆందోళనల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు పూర్తిగా నిలిపివేశారు. శుక్రవారం కూడా భూ నిర్వాసితులు విపక్ష పార్టీల మద్దతుతో ప్రాజెక్టు పునాదికట్టపై ధర్నాను కొనసాగించారు. ప్రభుత్వం దిగి వచ్చి ఎకరాకు 15 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లింపు, ఇంటికో ఉద్యోగం, పునరావాస కల్పనపై స్పష్టత ఇచ్చేవరకు పనులను జరగనివ్వబోమని హెచ్చరికలు జారీచేశారు. ఈ ధర్నాలో సీపీఐ మండల కార్యదర్శి ఈదుల బిక్షంరెడ్డి, విపక్ష పార్టీల నాయకులు, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.

చిత్రం.. ప్రాజెక్టు పునాదికట్టపై ధర్నా చేస్తున్న భూ నిర్వాసితులు