తెలంగాణ

విద్యార్థుల మృతి దేశానికి అరిష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, డిసెంబర్ 8: విద్యార్థుల మృతి దేశానికి అరిష్టమని, యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శి శౌర్యవీర్‌సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం ఓయూలో మృతి చెందిన మురళి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాల ఫలితంగానే దేశ వ్యాప్తంగా ఆత్మస్థైర్యం కోల్పోతున్న విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలలో నియామకాలు నిలిపివేయడం, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ను తెరపైకి తేవడంతో ఉన్నత విద్య చదివిన నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఓయూలో మురళి ఆత్మహత్య చేసుకోగా ఇందుకు ప్రభుత్వ విధానాలే కారణమని నిలదీశారు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ సర్కార్, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖాళీపోస్టుల నియామకాల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, విద్యార్థులకు ఫీజ్ రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఓయూలో విద్యార్థుల ఆత్మహత్య పరంపర కొనసాగుతున్నప్పటికీ నివారించకపోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనపడుతుండగా, బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన విద్యార్థులు, ఆయా పార్టీ నేతలను చితకబాది జైళ్లలో పెట్టడం సిగ్గుచేటని నిలదీశారు. విద్యార్థులు, యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనజాలలేదని, దేశ వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు చైతన్యవంతులై పాలక ప్రభుత్వాలకు బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. కాగా మురళి కుటుంబానికి రూ. 50లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతోపాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీసెల్ ప్రచార కార్యదర్శి ఎక్బాల్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు భానుప్రకాశ్‌రావు, జిల్లా ఎన్‌ఎస్‌యూఐ ఇన్‌చార్జి రాకేశ్, నాయకులు అంజి, హరీష్, మురళి, యాదగిరి పాల్గొన్నారు.