తెలంగాణ

తెలుగు వైభవాన్ని చాటేలా హోర్డింగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలుగు వైభవాన్ని చాటే విధంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ సిఎం కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ తెలిపారు. ఆ హోర్డింగ్స్‌లో సుప్రసిద్దులైన తెలుగు కవులు, రచయితల పేర్లు, వారి విశిష్టతను తెలియజేసే వ్యాఖ్యలు రాయడం జరిగిందని వివరించారు. అంతేకాకుండా హోర్డింగ్స్‌పై రచయితలు, వైతాళికుల పెయింటింగ్స్ చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని తెలిపారు. హోర్డింగ్‌ల రూపకల్పనలో అహోబిలం ప్రభాకర్, చేర్యాల రవిశంకర్ సహకారం అందించారని శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు సాహితీ మూర్తుల గురించిన సమాచారాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ పులకించిపోతున్నారని తెలిపారు.

చిత్రం..కేరళలోని కొచ్చిన్‌లో జరుగుతున్న 21వ అంతర్జాతీయ బుక్ ఫెస్టివల్‌లో ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేస్తున్న కవి, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీశంకర్.