తెలంగాణ

వేడుకలు సరే.. హామీల సంగతేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: అధికారపక్షమైన తెరాస ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి, అనునిత్యం వేడుకల్లో తేలియాడుతోందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ, కెజి టు పిజి అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ ప్రైవేటు జూనియర్ కాలేజీలతో కుమ్మక్కైందని ఆరోపించారు. ఫీజుల నియంత్రణపై కమిటీ ఉన్నా, న్యాయస్థానాల్లో ఎందుకు కేసులు నమోదవుతున్నాయని విమర్శించారు. న్యాయస్థానంలో పేలవమైన వాదనలను ప్రభుత్వం వినిపించడమే ఇందుకు కారణమని అన్నారు. బి కేటగిరి సీట్లను సైతం కౌనె్సలింగ్‌లోనే నింపాలని ఆయన డిమాండ్ చేశారు. సిఎం పేషీ నుండి అనుకూలమైన వారికి సీట్లు ఇప్పించుకోవడం, ప్రైవేటు కాలేజీలకు లబ్ది చేకూరేలా ప్రభుత్వం వ్యవహరించడం వల్ల పేదలకు అన్యా యం జరుగుతోందని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం అన్ని పరిపాలనా వ్యవస్థలను మార్చిలవేసి తమ గుప్పిట్లో ఉంచుకోవాలనే ప్రయత్నం చేస్తోందని, కుటుంబ సమగ్ర సర్వే , జిల్లా మండలాల పునర్విభజనతో పాటు సర్పంచ్‌లను డమీలను చేయాలనే ప్రయత్నంలో మన ఊరు- మన ప్రణాళిక పథకం తీసుకువచ్చిందని అన్నారు. పంచాయితీలను ప్రక్షాళన చేయడానికి పంచాయితీ చట్టాన్ని తెస్తామని చెబుతోందని ఇది ముఖ్యమంత్రి నియంతృత్వ ధోరణికి అద్దం పడుతోందని విమర్శించారు.