తెలంగాణ

ప్రపంచ తెలుగు మహాసభలకు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, గతంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రస్తుతం జరుగుతున్న సభలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను వెల్లడించేందుకు ఈ సభలను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారన్నారు. మహాసభలు విజయవంతం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని, ఇప్పటికే అనేక పర్యాయాలు సమావేశాలు జరిగాయన్నారు.
ఈ సభలకు విదేశాల నుండి 500 మంది, ఇతర రాష్ట్రాల నుండి 1500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని సిధారెడ్డి తెలిపారు. మన రాష్ట్రం నుండి 5000 నుండి 6000 మంది హారజరవుతున్నారని వివరించారు. ప్రధాన వేదిక అయిన ఎల్‌బి స్టేడియంలో ఎనిమిది ద్వారాలు ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో ద్వారానికి ఒక్కో ప్రముఖ కవి పేరు పెడుతున్నామన్నారు. పురావస్తు, పుస్తకాల ప్రదర్శనలు ఉంటాయని సిధారెడ్డి తెలిపారు. ఎల్‌బి స్టేడియంతో పాటు రవీంద్రభారతి, తెలుగు లలిత కళాతోరణం, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలను ఈ మహాసభలకు ఉపయోగిస్తున్నామన్నారు.
ప్రధాన సమావేశాలతో పాటు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రవాసభారతీయులకు ప్రత్యేక వేదిక ఉందని, మహిళలు, బాలలకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయన్నారు. తెలుగు లలతి కళాతోరణంలో జానపద ప్రదర్శనలు ఉంటాయన్నారు. రవీంద్రభారతలో శాస్ర్తియ కళల ప్రదర్శన, రవీంద్రభారతి మినీ స్టేడియంలో అష్టావధానం, సారస్వత పరిషత్తులో శతావధానం ఉంటాయన్నారు. తెలంగాణ ప్రజలంతా సహకారం అందించాలని సిధారెడ్డి కోరారు.