తెలంగాణ

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఒయు)లో బోధనేతర కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సిఎం కెసిఆర్‌ను కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన సిఎంకు లేఖ రాశారు. దాదాపు 25 ఏళ్ల నుంచి బోధనేతర సిబ్బంది కాంట్రాక్ట్ పద్దతిలో పని చేస్తున్నారని అన్నారు. సుమారు 1800 మంది బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఇప్పటికి యూనివర్శిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు రెండు వేలకు పైగా ఉన్నట్లు తెలిపారు. గత 28 రోజులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిపాలన విభాగం ముందు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆయన లేఖలో తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు వీరందరిని రెగ్యులర్ చేయాలని కోరారు.