తెలంగాణ

తెలుగు ఉపాధ్యాయుల నియామకం ఏది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం కాదని, తెలుగును ప్రోత్సహించేందుకు తెలుగు ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలని డెమోక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్) పేర్కొంది. ప్రాధమిక, మాధ్యమిక విద్యలో తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చెప్పడం కాదని, పెద్ద ఎత్తున ప్రైవేటు ఇంగ్లీషు మీడియం పాఠశాలలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని డిటిఎఫ్ ప్రశ్నించింది. డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రఘుశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి, ఉపాధ్యక్షుడు ఎం.వెంకట్రాములు, కార్యదర్శులు సోమవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశ్యంతో అట్టహాసంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించుతూనే, మరో చేత్తో 540 రెసిడెన్సియల్ ఇంగ్లీషు మీడియం స్కూళ్లను ప్రారంభించడం దేనికి సంకేతమని నిలదీశారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్ధానాలకు భిన్నంగా సిఎం కెసిఆర్ పాలన సాగిస్తున్నారని అన్నారు. తెలుగు భాషను, సంస్కృతిని పరిరక్షిస్తానని చెప్పి ఇంత వరకు తెలుగు భాషా ఉపాధ్యాయులను నియమించలేదని అన్నారు. తాము తెలుగు మహాసభల నిర్వహణ పట్ల నిరసన తెలియజేస్తున్నామని, ఏకీకృత సర్వీసు నిబంధనల అంశాన్ని పరిష్కరించాలని, టీచర్లకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎస్‌సి పరీక్షల్లో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోరాదని అన్నారు. డిటిఎఫ్ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు వారు వెల్లడించారు.