తెలంగాణ

దేశం గర్వించే నేత రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: ఎఐసిసి అధ్యక్షునిగా ఎన్నికైన రాహుల్ గాంధీ దేశం గర్వించదగ్గ నాయకుడని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి కొనియాడారు. ఎఐసిసి అధ్యక్షునిగా రాహుల్ ఏకగ్రీవంగా ఎన్నికైనందున ఆయన హర్షం ప్రకటించారు. 47 ఏళ్ళ రాహుల్‌కు రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేగల సత్తా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాహుల్ నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారని, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మూడు సార్లు దేశ ప్రధాని అయ్యేందుకు అవకాశం ఉన్నా త్యాగం చేశారని ఆయన గుర్తు చేశారు. రాహుల్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో కాంగ్రెస్ శ్రేణులు గాంధీ భవన్‌లో సంబరాలు జరుపుకున్నాయి. డప్పువాయిద్యాలతో నృత్యం చేశారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు.