తెలంగాణ

వ్యవసాయాభివృద్ధికి ‘తొలి దశకం’ ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: రైతులకు మేలు చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వ్యవసాయ రంగంలో ‘తొలి దశకం విధాన పత్రం’ (్ఫస్ట్ డికేడ్ డాక్యుమెంట్) రూపొందించేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. వ్యవసాయం, ఉద్యాన శాఖలతో పాటు సంబంధిత కార్పొరేషన్లు, యూనివర్సిటీల ఉన్నతాధికారులతో వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి సచివాలయంలో సోమవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో ఎదురౌతున్న అన్ని సమస్యలను 2024 వరకు పరిష్కరించి, ‘నభూతో నభవిష్యతి’ అన్న విధంగా విధాన పత్రాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2024 వరకు ఏయే అంశాల్లో ముందుకు వెళ్లాలో నిర్ధారించి, అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలను గుర్తించాల్సి ఉందన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం తీసుకువచ్చేందుకు విధాన పత్రాన్ని రూపొందించేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సిజిజి) కు బాధ్యత ఇస్తున్నామన్నారు. ఈనెల చివరి వరకు విధాన పత్రం రూపొందించాలని లక్ష్యంగా పెట్టామన్నారు. వ్యవసాయ రంగంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి సమగ్ర వ్యవసాయాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులంతా దృష్టి కేంద్రీకరించాలని పార్థసారథి ఆదేశించారు.