తెలంగాణ

వారంలోగా పంటల బీమా పూర్తిగా చెల్లించండి: పోచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: రాష్ట్రంలో 2015-16, 2016-17 సంవత్సరాలకు సంబంధించి పం టల బీమా సొమ్ము మొత్తాన్ని వారంరోజుల్లోగా చెల్లించాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. వ్యవసాయ, బీమా శాఖల అధికారులతో మంగళవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 2016-17 సంవత్సరానికి రైతులకు 154 కోట్ల రూపాయలు బీమా మొత్తం చెల్లించాల్సి ఉండగా, ఇంకా 10 కోట్ల రూపాయల బకాయిలుగా ఉన్నాయని, ఈ మొత్తాన్ని వారంలోగా చెల్లించాలని బీమా కంపెనీ అధికారులను ఆదేశించారు. 2016-17 సంవత్సరం రబీకి సంబంధించి బ్యాంకుల నుండి రుణాలు తీసుకోని రైతులకు బీమా మొత్తం దాదాపు 12 కోట్లు చెల్లించాల్సి ఉందని, వెంటనే ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు కేవలం 2.81 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించారని గుర్తు చేశారు.