తెలంగాణ

ఉద్యోగ ప్రకటనలకు దిక్కే లేదు: బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉద్యోగ ప్రకటనల దిక్కే లేదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ వి సుభాష్ ఆరోపించారు. మంగళవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఎపిలో రెండు డిఎస్సీలు విడుదల చేశారని అన్నారు. ఉద్యోగాలు లేక యువత, నిరుద్యోగులు అయోమయంలో పడ్డారని, నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. పనిచేయగలిగే శక్తి ఉన్న యువత చేతిలో పనిలేకపోవడం వల్ల ఆర్ధిక వ్యవస్థకు నష్టం కలిగే అవకాశం ఉన్నా ఈ పాలకులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ కాలేజీలు, విద్యాసంస్థల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయలేదని అన్నారు.