తెలంగాణ

రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. మంగళవారం రాష్ట్రంలోని అన్ని డిపోల ముందు కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి తమ నిరసన, ధర్నా నిర్వహించారు. గుర్తింపు పొందిన టీఎంయూ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ కార్మికుల హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. తార్నాక ఆసుపత్రిలో మందుల విభాగం ఔట్‌సోర్సింగ్ చేసిన అగ్రిమెంట్‌ను వెంటనే రద్దు చేయాలని, సకల జనుల సమ్మెకాలానికి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ అధ్యక్షుడు ఎన్ బాబు, ప్రధాన కార్యదర్శి కె రాజిరెడ్డి రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఏప్రిల్ ఒకటిన సవరించిన వేతన పే స్కేలు తొమ్మిది నెలలు గడుస్తున్నా ఆచరణకు నోచుకోలేదని ఆరోపించారు. తక్షణమే 62 శాతం ఫిట్‌మెంట్‌తో పే స్కేల్ చేయాలని, లేనిపక్షంలో 30శాతం (ఐఆర్) తాత్కాలిక భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలోని కొన్ని విభాగాలను మూసివేసే ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.