తెలంగాణ

మనసున్న పోలీసులు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామడుగు, డిసెంబర్ 13: సంసారంలో భార్యా-్భర్తలు అన్నప్పుడు స్పర్థలు రావడం సహజమని, అంత మాత్రాన విడిపోవడం భావ్యమా? మీ నిర్ణయం అయినవాళ్లకు ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతుందని అర్థం చేసుకోవాలంటూ ప్రేమాప్యాయత మాటలతో మన పోలీసులు రెండు సంవత్సరాలుగా దూరంగా ఉం టున్న దంపతులను కలిపారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని వెదిర గ్రామానికి చెంది న కడారి దివ్య వివాహం కురిక్యాల గ్రామానికి చెందిన కడారి జనార్ధన్‌తో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల బాబు ఉన్నాడు. గత రెండు సం వత్సరాల క్రితం వీరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు ఏర్పడ్డాయి. అప్పటి నుండి దివ్య తల్లిగారిల్లయిన వెదిరిలో ఉంటుంది. గత నెలలో దివ్య చెల్లెలు తల్లితో గొడవ పెట్టుకొని ఇంటి నుండి వెళ్లిపోగా స్థానిక సిఐ రమేష్, ఎస్‌ఐ నరేష్‌రెడ్డిల చొరవతో ఇంటికి చేరింది. అయితే ఇంటిలో తల్లి, ఇద్దరు కూతుళ్లు కూలీ పనులు చేసుకుంటూ జీవించడం ఇంటికి పెద్దదిక్కు లేకపోవడమే కారణంగా భావించి వీరి కుటుంబానికి కొంత మేరకైనా సహాయం చేయాలనే సంకల్పంతో పోలీసులు దివ్య భర్తను వెదిరకు రప్పించి రెండు రోజులుగా పలు విధాలుగా కౌన్సిలింగ్ ఇచ్చి బుధవారం వీరిరువురిని దగ్గరుండి అత్తగారింటికి ఆటో ఎక్కించి పంపించారు. ఎప్పుడు బిజీగా ఉండే పోలీసులు మంచి మనసుతో వారిని కలుపడంతో గ్రామస్థులు అభినందించారు. ఇదే పోలీసులు గతంలో తిరుమలాపూర్‌లో పెళ్లి నిశ్ఛయమై పెళ్లి కూతురు తండ్రి చనిపోవడంతో నిలిచిపోయిన పెళ్లిని పోలీసులు దగ్గరుండి వివాహం జరిపించిన విషయం తెలిసిందే.