తెలంగాణ

సాంకేతిక లోపంతో పేలిన మోటార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అతి తక్కువ కాలంలో నిర్మించిన భక్తరామదాసు ప్రాజెక్టు రెండవ దశ ట్రయల్ రన్ విజయవంతమైనా సాంకేతికలోపంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. బుధవారం ఉదయం ట్రయల్న్ విజయవంతం కాగా సాయంత్రం సమయంలో మోటార్లు ఆఫ్ చేయగానే ఎలక్ట్రికల్ ప్యానల్ పేలిపోయింది. వెంటనే మెగా కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించిన అధికారులు మంటలను ఆర్పివేశారు. దీంతో రెండవ దశ మరికొంత ఆలస్యంగా రైతులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బుధవారం అధికారులు ట్రయల్ రన్ నిర్వహించగా రెండు, మూడు రోజుల్లోనే దీనిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించినా సాంకేతిక లోపంతో ఇది మరింత ఆలస్యం కానున్నది.
ప్భుఃక్తరామదాసు మొదటి దశ ద్వారా సాగునీరు అందని గ్రామాలకు నీరందించేందుకు రూపొందించిన రెండవ దశ ట్రయల్ రన్‌ను బుధవారం సీఈ సుధాకర్ పర్యవేక్షించారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ 2016 ఫిబ్రవరి 16న శంకుస్థాపన చేశారు. ఈప్రాజెక్టును రూ.90.87 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. పైపులు, మోటార్లు కలిపి సుమారు రూ.300 కోట్లకు చేరింది. సీఎం శంకుస్థాపన చేసిన తొమ్మిది నెలలకే పథకాన్ని పూర్తి చేసి ప్రారంభించారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలోని 60వేల ఎకరాలకు సాగునీరందించేలా రూపొందించిన ఈ ప్రాజెక్టు పరిధిలో పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఏడు గ్రామాలు లేకుండా పోవడంతో వీటికోసం రెండవ దశను చేపట్టారు. 2016 జనవరి 23 నుండి ఏప్రిల్ 11వ తేదీ వరకు నీటిని వదిలి 300 చెరువులు నింపారు. మొదటి దశ కింద సాగునీరు అందని గ్రామాలకు 5.4 కోట్ల రూపాయలను కేటాయించి పనులను పూర్తి చేశారు. కాకరవాయి, రఘునాథపాలెం, రాజారం, పైనంపల్లి, జూపెడ, బచ్చోడు, పైనంపల్లి, లక్ష్మీదేవిపల్లితండాలకు సాగునీటిని రెండవ దశ కింద సరఫరా చేసి చెరువులు నింపనున్నారు. పాలేరు రిజర్వాయర్ నుండి తిరుమలాయపాలెం మండలంలోని ఇస్లావత్‌తండా వరకు 16.5 కిలోమీటర్ల పరిధిలో రెండువైపులా పైప్‌లైన్లు అమర్చారు.
పైపులకు అమర్చిన రెండు మోటార్ల సహాయంతో పాలేరు నుండి భక్తరామదాసు ప్రాజెక్టుకు సాగునీరు అందిస్తారు. కాల్వల ద్వారా గ్రామాలలోని చెరువులను నింపుతూ భూగర్భ జలాలను పెంపొందిస్తారు. రెండవ విడతలో భాగంగా మొదటి మోటారుకు అమర్చిన పైపులైన్‌కు సుబ్లేడు గ్రామశివార్‌లో గోల్‌తండా సమీపంలో టి ఆకారంలో ఉన్న పైప్‌లైన్‌కు కలిపారు. అటుతరువాత ఆయా గ్రామాలకు అనుసంధానం చేసిన పిల్ల కాల్వల సహాయంతో ఆయా గ్రామాల్లోని చెరువులను నింపుతారు. త్వరలోనే సాంకేతిక లోపాన్ని సరిజేసి రెండవ దశను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.