తెలంగాణ

ఓబీసీ మహా సంగ్రామ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: ఒబిసిల సమస్యల పరిష్కారానికి వచ్చే ఏడాది జనవరిలో హైదరాబాద్‌లో భారీ మహాసంగ్రామ సభను నిర్వహించనున్నట్టు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తెలిపారు. ఒబిసి మోర్చ పదాధికారుల సమావేశం నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో బుధవారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి ఒబిసి మోర్చ అధ్యక్షుడు కాటం నర్సింహ యాదవ్ అద్యక్షత వహించారు. రాష్ట్రంలో 54 శాతం ఉన్న బిసిల జనాభా సమస్యలపై నిక్కచ్చిగా పోరాడే పార్టీ బిజెపి మాత్రమేనని అన్నారు.
బిసిలు అనేకమంది బిజెపి వైపు ఎదురుచూస్తూ అనేక కార్యక్రమాల్లో పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ సంతుష్టీకర విధానాలను అవలంభిస్తూ మతపరమైన రిజర్వేషన్లు కల్పించడం, రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని లక్ష్మణ్ తెలిపారు. బిసి జనాభాలో ముస్లింలను చేర్చడం వల్ల బిసి రిజర్వేషన్లు ప్రమాదంలో పడ్డాయని అన్నారు. బిసిల్లో చైతన్యం లేకపోవడం వల్ల గత వైఎస్‌ఆర్ ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం , టిఆర్‌ఎస్ ప్రభుత్వం 12 శాతం ఇవ్వజూపాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు డాక్టర్ సుభాష్ చంద్రబోస్, సదానందం, చారి, రాములు,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.