తెలంగాణ

బంగారు తెలంగాణ బడ్జెట్ 2024లో రూ.5లక్షల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: బంగారు తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రప్రభుత్వం రూపొందిస్తున్న 2024 విజన్ డాక్యుమెంట్‌లో 2024లో రాష్ట్ర బడ్జెట్ రూ.5 లక్షల కోట్లు ఉండే విధంగా అభివృద్ధిని చేపట్టాలని నిర్దేశించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో బంగారు తెలంగాణ డాక్యుమెంట్ సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పటి నుంచి మిగులు బడ్జెట్‌తో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది.
దీని వల్ల దేశంలో ధనిక రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చేరింది. 2015-16లో తెలంగాణ ప్రభుత్వం రూ.1.15 లక్షల కోట్లు, 2016-17లో రూ.1.30 లక్షల కోట్లు , 2017-18లో రూ. 1.49కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇదే ఉత్సాహంతో, వచ్చే ఆరేళ్లు అన్ని రంగాల్లో అభివృద్థిని సమతుల్యతతో సాధిస్తే రూ.5లక్షలకోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం దేశంలో ఉత్తరప్రదేశ్ బడ్జెట్ రూ. 3.77 లక్షల కోట్లు, మహారాష్టల్రో రూ. 2.21లక్షల కోట్లు, మధ్యప్రదేశ్‌లో రూ.1.85 లక్షల కోట్లు, గుజరాత్‌లో రూ.1.72 లక్షల కోట్లు, బీహార్‌లో రూ. 1.60 లక్షల కోట్లతో దూసుకుపోతున్నాయి. సాధారణంగా ప్రతి ఏటా 15 శాతం అదనంగా బడ్జెట్ అంచనాలను పెంచుతారు. 2019 ఎన్నికల తర్వాత నుంచి బంగారు తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. 34 శాఖలు విజన్ డాక్యుమెంట్‌కోసం శ్రమిస్తున్నాయి. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఆ ఏడాది పూర్తి స్ధాయి బడ్జెట్‌ను రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. పూర్తి స్ధాయి బడ్జెట్‌ను రూ. 2015-16లోనే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో సాలీనా వృద్ధిరేటు 17.81 శాతం నమోదైంది. బంగారుతెలంగాణ ముసాయిదా డాక్యుమెంట్‌ను ఈ నెలాఖరుకు ముఖ్యమంత్రికి అధికారులు సమర్పించనున్నారు. వీటికి మార్పులు చేర్పులు చేసి వచ్చే ఏడాది సంక్రాంతి పండగకు బంగారు తెలంగాణ డాక్యుమెంట్‌ను విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.