తెలంగాణ

మూసీ ఈస్ట్-వెస్ట్ కారిడార్ ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: హైదరాబాద్‌లో నిర్మిస్తామన్న ఈస్ట్-వెస్ట్ కారిడార్ ఏమైందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకూరు సుధాకర్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మెట్రోరైల్ ప్రారంభ సమయంలో దాంతో కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ఏ సంబంధం లేదని, శంకుస్థాపన జరిగాక మెట్రోను అడ్డుకోవాలని బహిరంగ సభల్లో చెప్పారని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అదే కేసీఆర్ మెట్రో డెవలప్‌మెంట్‌ను చూసి ఇదంతా తామే చేశామంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. కేసీఆర్ 12 జంక్షన్లతో 41కి.మీ. పొడవున ఆరు లైన్లతో మూసీ నది వెంబడి ఈస్ట్-వెస్ట్ కారిడార్‌ను నిర్మిస్తామన్నారని, ఆ కారిడార్ ఏమైందని ఆయన నిలదీశారు. రూ. 5.916 కోట్లతో స్కైవేలు నిర్మిస్తామన్న కేసీఆర్ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని సుధాకర్ ఆరోపించారు. కొత్తగూడెం జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా జరిగిందన్నారు. ఈనెల 18న సోమాజిగూడ ప్రెస్క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.