తెలంగాణ

‘మోన్‌శాంటో కంపెనీపై చర్యలు తీసుకోవాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా అక్రమంగా రాష్ట్రంలో బి, జి, -3 పత్తి విత్తనాలు సరఫరా చేసిన మోన్‌శాంటో కంపెనీపై చర్యలు తీసుకుని, రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అనుమతి లేకుండానే బి, జి,-3 పత్తి విత్తనాలు రాష్ట్రంలో లక్ష ఎకరాల్లో సాగు చేశారని సంఘం అధ్యక్షుడు పి.జంగారెడ్డి, కార్యదర్శి టి.సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో మనుష్యులు, ఇతర జీవరాశులపై కూడా ఈ పత్తి విత్తనాల ప్రభావం చూపుతోందని తెలిపారు. చట్టవిరుద్దంగా వ్యవహరించిన మోన్ శాంటో కంపెనీపై చర్యలు తీసుకుని రైతులకు పరిహారం ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలు కొన్న ప్రభుత్వ సంస్థలు రైతులకు చెల్లించాల్సిన డబ్బును వెంటనే చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది.