తెలంగాణ

టిఎస్‌యుటిఎఫ్ అధ్యక్షుడిగా రాములు ఉపాధ్యక్షుడిగా సోమశేఖర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లాకు చెందిన చిలకరాజు రాములు, ఉపాధ్యక్షుడిగా వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన కోకల సోమశేఖర్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆది, సోమవారాల్లో వరంగల్ జిల్లా హన్మకొండలో ఎ నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగిన టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ ఎన్నిక జరిగినట్టు యుటిఎఫ్ ప్రధానకార్యదర్శి చావ రవి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎ నర్సిరెడ్డి, మాణిక్‌రెడ్డిలు రాష్ట్ర కార్యదర్శులుగా ఆఫీసు బేరర్లుగా కొనసాగుతారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రాములు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి , ఉపాధ్యాయ సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు.