తెలంగాణ

అస్సాం రైఫిల్స్ సైనికుల పిల్లలకు ఉన్నత విద్యలో రిజర్వేషన్ కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: అస్సాం రైఫిల్స్ (సాయుధ దళం)లో పని చేసిన సైనికోద్యోగుల పిల్లలకు ఉన్నత విద్యలో రిజర్వేషన్లు కల్పించాలని సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సిఎం కెసిఆర్‌ను కోరారు. ఇందుకోసం 1993లో జారీ చేసిన 192 జివోను సవరించాలని చాడ సిఎంకు రాసిన లేఖలో కోరారు. సాయుధ దళాల పిల్లలకు ప్రాముఖ్యత ఇవ్వడానికి జివో 192ను ఉన్నత విద్య విభాగం విడుదల చేసిందని, అయితే ఈ జివోలో అస్సాం రైఫిల్స్ విభాగానికి చెందిన మాజీ సైనికుల పిల్లలను చేర్చలేదని ఆయన వివరించారు. దీంతో ఉన్నత విద్యావకాశాలను అందిపుచ్చుకోలేక అస్సాం రైఫిల్స్ సైనికుల పిల్లలు మానసింగా కృంగిపోతున్నారని ఆయన సిఎం దృష్టికి తెచ్చారు.