తెలంగాణ

మంద కృష్ణ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మంద కృష్ణమాదిగ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై కేసు నమోదైంది. ఎస్సీ వర్గీకరణ పేరుతో ఆదివారం అర్ధరాత్రి అనూహ్య ర్యాలీ నిర్వహించిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. తెలుగు మహాసభల బ్యానర్లు, హోర్డింగ్‌లను ధ్వంసం చేసి, పోలీసులపై కుర్చీలు, కర్రలతో దాడి చేశారు. పోలీసు బైకులకు నిప్పుపెట్టారు. ఈ విధ్వంసం నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే విధంగా వ్యవహరించారంటూ మంద కృష్ణమాదిగ సహా 148 మంది కార్యకర్తలపై ఎనిమిది సెక్షన్ల కింద కార్ఖానా, రాంగోపాల్‌పేట్ పీఎస్‌లో కేసులు నమోదు చేసినట్టు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఇదిలావుండగా ఆదివారం రాత్రి అరెస్టయిన మంద కృష్ణమాదిగతోపాటు పలువురిని పాతబస్తీలోని కమాటిపుర పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. సోమవారం వారిని కోర్టులో హాజరుపరచిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నాయని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని వారు హెచ్చరించారు.