తెలంగాణ

తెరాస వ్యతిరేకుల పునరేకీకరణ జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: టిఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఐక్యం కావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా ఈ నెల 20న జడ్చర్లలో ‘జన గర్జన’ పేరిట నిర్వహించనున్న బహిరంగ సభతో టిఆర్‌ఎస్ వ్యతిరేక శక్తుల ఐక్యతకు నాంది పలుకుతుందని ఆయన తెలిపారు. జడ్చర్ల జన గర్జన సభను విజయవంతం చేసేందుకు టిఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులు, ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన సోమవారం ఒక ప్రకటనలో కోరారు.
రాష్ట్రంలో విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు, వృత్తిదారులు ప్రతి ఒక్క వర్గం కష్ట నష్టాల పాలు అవుతున్నారని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇంకా హామీలతో మభ్య పెట్టి రాజకీయ భ్రమలు కల్పించే యత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో శాంతి-్భద్రతలు పూర్తిగా క్షీణించాయని, అవినీతి రాజ్యమేలుతున్నదని, ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఉద్యమాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంకుశ పాలన కొనసాగుతున్నందున, కెసిఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.