తెలంగాణ

రాష్టప్రతికి ఘనస్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘనస్వాగతం లభించింది. రాష్టప్రతికి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఉప ముఖ్యమంత్రులు మొహమ్మద్ అలీ, కడియం శ్రీహరి, శాసనమండలి చైర్మన్ కె స్వామిగౌడ్, స్పీకర్ మధుసూధనాచారి, మేయర్ బొంతు రామమోహన్ స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయంలోనే రాష్టప్రతి సైనిక వందనం స్వీకరించారు. వెంటనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు రాష్టప్రతిని గవర్నర్, ముఖ్యమంత్రి తోడ్కొని వచ్చారు. అనంతరం మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలు ఒకొక్కరూ వచ్చి రాష్టప్రతికి బొకేలు అందజేశారు. పలువురు నేతలు రాష్టప్రతికి కరచాలనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ అధికారులతో పాటు సీనియర్ పోలీసు అధికారులు, ఐఎఎస్ అధికారులు పాల్గొన్నారు. అక్కడి నుండి రాజ్‌భవన్‌కు చేరుకున్న రాష్టప్రతి అల్పాహార విందు స్వీకరించారు. అనంతరం ఆయన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమంలో పాల్గొని 8 గంటలకు తిరిగి రాజ్‌భవన్‌కు వచ్చారు. బుధవారం ఉదయం ఆయన హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధవిగ్రహాన్ని సందర్శిస్తారు.