తెలంగాణ

కనీవినీ ఎరుగని రీతిలో తెలుగు మహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రపం తెలుగు మహాసభలు కనీవిని ఎరుగని రీతిలో జరిగాయని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. మంగళవారం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం, శ్రీ వానమామలై వేదికపై జరిగిన మహాసభలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ కవి సమ్మేళనానికి రెండు రాష్ట్రాల నుంచే కాకుండా ముంబై, భీవాండి, షోలాపూర్, చెన్నై, బెంగుళూరుతోపాటు 42 దేశాలకు చెందిన ప్రతినిధులు రావడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు భాషను కాపాడుకోవాలని, నవ సమాజ నిర్మాణానికి కవితాక్షరాలు తోడ్పడతాయన్నారు. కవులు, కళాకారులు, రచయితలు మనసుతో చూస్తారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్‌తో కలసి ‘కదం సే..కదం మిలాయే’ అంటూ పోరాడామని హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మామా ఫసియొద్దిన్ అన్నారు. కనపడకుండా పోతుందనుకున్న తెలుగున బతికించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు..42 దేశాలు ముందుకు రావడం ముదావహమన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణా యాస ఉత్తేజితులను చేసిందన్నారు. దోపిడీ, వివక్షను తెలంగాణ భాష అస్త్రంగా ఎదుర్కొందని, మాతృభాషను కాపాడుకోవడమే కాకుండా, ప్రపంచ స్థాయి సభలు నిర్వహించుకోవడం మన అదృష్టమని తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా 280 మంది కవులను వనపర్తిలో సత్కరించడం జరిగిందన్నారు. రాష్ట్రేతర తెలుగువారి సౌకర్యార్థం నాన్ రెసిడెన్షియర్, గెస్ట్‌హౌస్ అనే పరుతో ఒక భవనాన్ని నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎంపి వీర మల్లె ప్రకాష్ అన్నారు. రవీంద్రభారతిలో బండారు ఆచమాంబ వేదికపై సాహితీ వేత్తల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. సాహితీవేత్తలు, భాషాభిమానులు ఆయా రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలుగు అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

చిత్రం..ప్రపంచ తెలుగు మహా సభల వేదికపై ప్రసంగిస్తున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీత