తెలంగాణ

గుజరాత్ ఫలితం సూపర్ సిక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: గుజరాత్ ఎన్నికల ఫలితం సూపర్ సిక్స్ వంటిదని బిజెపి శాసనసభా పక్షం నాయకుడు జి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఆరోసారి గెలిచినా గుజరాత్ ఫలితం తక్కువ చేసి చూపుతున్నారని, ఐదేళ్లకే హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారం కోల్పోతే దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదని ఆయన ఎద్దేవా చేశారు. గుజరాత్ గెలుపు కాదన్నట్టు , అక్కడ కాంగ్రెస్ ఏదో సాధించినట్టు చెబుతున్నారని పేర్కొన్నారు.
కిరాయి నాయకులతో కాంగ్రెస్ పార్టీ అమలుకు నోచుకోని హామీలతో , కులం పేరుతో అనేక రకాలుగా రెచ్చగొట్టి అధికారంలోకి రావడానికి ఏ రకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిందో దేశ ప్రజలకు అందరికీ తెలుసని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు కాంగ్రెస్ బలం కాదని, అది వాపు మాత్రమేనని అన్నారు. ఆప్ 11 మందిని నిలిపిందని, చివరికి కొన్ని సీట్లను కాంగ్రెస్ పార్టీకి సమర్పించుకుందని, అలాగే మిగిలిన ప్రాంతీయ పార్టీల నేతలు సిద్ధాంతాలను, విబేధాలను పక్కన పెట్టి కూడబలుక్కుని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తే ఈ మాత్రం సీట్లు సాధించిందని అన్నారు. పాల్వంచలో ఏర్పాటుచేయతలపెట్టిన స్క్రాప్ ఆర్క్ ఫర్నేస్ (తుక్కుతో ఉక్కు పరిశ్రమ) బయ్యారం స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి ఎన్‌ఎండిసి తీసుకున్న నిర్ణయంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. బిజెపి నేతలతో ఆయన ఎన్‌ఎండిసి సిఎండి బైజేంద్ర కుమార్‌ను కలిసి స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించి చర్చించారు. ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని ఆయన అన్నారు. 1.0 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ప్లాంట్ ఏర్పాటు వల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు అవుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బద్దం బాల్‌రెడ్డి, కుంజ సత్యవతి, ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, పార్టీ నేతలు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అమర్‌నాథ్ సొరంగుల, బెహరా యర్రం రాజు, చింతల చెరువు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.