తెలంగాణ

ప్రశాంతత నెలకొనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతత నెలకొనేందుకు ప్రభుత్వ అధికారులు, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. ఉట్నూరు సంఘటన నేపథ్యంలో డీజీపీ మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఉట్నూరులో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, పోలీసులు ప్రజల్లో మమేకమై పనిచేయాలని, ప్రత్యేకించి ఆదివాసీలకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు, వారి అభివృద్ధి కోసం, ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ అధికారులతో కలసి పనిచేయాలని డీజీపీ సూచించారు. ఆదీవాసీల సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని, ఆదివాసీల ప్రాంతాల్లో సమస్యలను నక్సలైట్లు సాకుగా తీసుకునే ప్రమాదముందన్నారు. గిరిజనులు, ఆదివాసీల మధ్య ఘర్షణ నక్సలైట్లు అనువుగా మార్చుకునే ప్రమాదం ఉందని కూడా డీజీపీ పేర్కొన్నారు. ఇటీవల ఉట్నూరులో జరిగిన ఘర్షణలకు మావోయిస్టులే బాధ్యులని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు వాస్తవం కాదని డీజీపీ కార్యాలయం నుంచి వెలువడిన పత్రిక ప్రకటన స్పష్టం చేసింది. మావోయిస్టులకు అలాంటి అవకాశం ఇవ్వకూడదని పేర్కొంది. శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటిస్తూ, సహకరించాలని డీజీపీ కోరారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న డీజీపీ మహేందర్‌రెడ్డి