తెలంగాణ

సీతారామా, నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలకు వన్యప్రాణి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బోర్డు సభ్యులు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రాథోడ్ బాబురావు, కోరం కనకయ్య, పీసీసీఎఫ్ ప్రశాంత్‌కుమార్ ఝూ పలువురు ఉన్నతాధికారులు, ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు. పాత ఖమ్మం జిల్లాలోని సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, పాత నల్గొండ జిల్లా నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు వన్యప్రాణి బోర్డు అనుమతించింది. ఈ ప్రతిపాదనలు కేంద్ర వన్యప్రాణి మండలికి అనుమతి కోసం నివేదించింది. పాత ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ నియోజకవర్గం సిర్పూర్, టీ మండలంలోని రెండు బ్రిడ్జిల నిర్మాణాలకు రాష్ట్ర వన్యప్రాణి బోర్డు అనుమతించింది. చింతల్‌కుంట నుంచి భూపాలపట్నం మధ్య నిర్మించనున్న ఈ రెండు బ్రిడ్జిల నిర్మాణాలకు రాష్టస్థ్రాయిలోనే అనుమతి సరిపోతుంది. పాత ఖమ్మం జిల్లా మహబూబాబాద్ జిల్లా పరిధిలో సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 6.75 లక్షల ఎకరాల్లో సాగునీటిని అందించేందుకు రూప కల్పన చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కినె్నరసాని అభయారణ్యం ఎకోజోన్ నుంచి 442 హెకా ల అటవీ ప్రాంతానికి వన్యప్రాణి మండలి అనుమతి తప్పనిసరిగా మారింది. దీంతో రాష్టస్థ్రాయి వన్య ప్రాణి బోర్డులో అనుమతిస్తూ..తుది అనుమతి కోసం కేంద్ర వన్యప్రాణి మండలికి ప్రతిపాదించారు. సీతారామా ప్రాజెక్టు పరిధిలో వన్యప్రాణి సంరక్షణ కోసం రూ. రూ. 2.41 కోట్ల ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించిన తరువాత వన్యప్రాణులు తిరిగేందుకు 12 అండర్ ప్రాసెస్‌లను ప్రతిపాదించారు. ఎకో బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టనున్నట్టు మంత్రులు జోగు రామన్న, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.