తెలంగాణ

ఆర్టీసీ బలోపేతానికి కృషి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: టీఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ఎంతో క్రమశిక్షణ కలిగిందని, ఎంతో మంది కురువృద్ధులు ఏర్పాటు చేసిన యూనియన్ సంస్థ అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఎంప్లారుూస్ యూనియన్ ద్వితీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. యూనియన్ గౌరవాధ్యక్షుడు సయ్యద్ అజీజ్‌పాషా యూనియన్ జెండాను ఆవిష్కరించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ రమణరావు మాట్లాడుతూ, కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం చిత్తశుద్ధితో ఉందని, ఆర్టీసీ లాభాల బాటలోకి వస్తుందన్నారు. వచ్చే మేడారం జాతరకు కార్మికులంతా కృషి చేసి ఆదాయాన్ని పెంపొందించాలని కోరారు. ఏఐటీయూసీ అధ్యక్షుడు కామ్రెడ్ నరసింహా మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఎంప్లారుూస్ యూనియన్లలో అతిపెద్ద రెండో యూనియన్ అన్నారు. ఆర్టీసీలో కొన్ని విభాగాల మూసివేతలను నిలిపివేయాలన్నారు. యూనియన్ గౌరవాధ్యక్షుడు, మాజీ ఎంపి అజీజ్‌పాషా మాట్లాడుతూ, మఖ్దూం మోహియుద్దీన్, రాజ్‌బహదూర్‌గౌడ్, కెఎల్ మహేంద్ర, రంగారావు వంటి నాయకులు నడిపించిన యూనియన్‌కు ఎంతో చరిత్ర ఉందన్నారు. కార్మికుల పక్షాన నిలిచే ఎంప్లారుూస్ యూనియన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మికులకు చేసిందేమీ లేదన్నారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ కాలయాపన చేస్తున్నారన్నారు. సకల జనుల సమ్మెకాలానికి ఆర్టీసీ కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ఎందుకు ప్రకటించలేదని ఆయన ఎద్దేవా చేశారు.