తెలంగాణ

జమిలి ఎన్నికలకు వ్యతిరేకం: సీపీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: దేశ వ్యాప్తంగా ఒకేసారి (జమిలి) ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు తాము వ్యతిరేకం అని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. తమ అభిప్రాయంతో ఏకీభవించే పార్టీలను, శక్తులను కలుపుకుని ఉద్యమిస్తామని సుధాకర్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు ఉన్న స్వయం ప్రతిపత్తిని, ఇతర అవకాశాలను కాలరాసే చర్యలను ఆమోదించేది లేదని ఆయన చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితుల దృష్ట్యా అవిశ్వాసాలు, ఇతర సమస్యలు ఏర్పడుతుంటాయి కాబట్టి జమిలి ఎన్నికలు సాధ్యం కాదన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేయాలనుకుంటున్న సంస్కరణల గురించి ప్రజలకు ముందే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రోలియం, గ్యాస్ నిల్వలను ప్రభుత్వ రంగ సంస్థలకు కాకుండా ప్రైవేటు రంగానికి అప్పగించే చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రైవేటు సంస్థలకు ఇస్తున్న రాయితీలను తమకు ఇస్తే ఇంత కంటే మెరుగైన రీతిలో గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తులను వెలికి తీస్తామని ప్రభుత్వం రంగ సంస్థలు చేస్తున్న విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ఎఫ్‌ఆర్‌డిఎ బిల్లు ఆమోదయోగ్యం కాదని, ఇది బ్యాంకింగ్ రంగంలో తీవ్రమైన సమస్యలను సృష్టిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్‌ఆర్‌డిఎ చట్టంలోని లొసుగులను ప్రతిపక్షాలు వెలికి తీయడం వదంతులా? అని సురవరం ప్రధానిని ప్రశ్నించారు. గిరిజనుల మధ్య ఏర్పడిన సమస్యలకు ముఖ్యమంత్రి కెసిఆర్ దోషి అని ఆయన విమర్శించారు. గిరిజనుల సమస్యపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.