తెలంగాణ

సర్పంచ్ అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 19 : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ ఆత్రం నరేష్ (31) సోమవారం అనుమానాస్పదంగా మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... స్నేహితులతో నరేష్ కలిసి వేములవాడ వెళ్లాడని, మంగళవారం ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆసుపత్రికి చేరుకుని స్నేహితులే హత్య చేశారంటూ ఆరోపించారు. ఆదివారం తన భార్యను మందమర్రిలోని అత్తవారి ఇంట్లో వదిలి సోమవారం తెల్లవారుజామున తమ స్నేహితులైన రంగు మహేందర్ గౌడ్, కొక్కెర రాజు, తాండూరి చంద్రశేఖర్, నాయిని పోశంతో కలిసి కారులో ఆత్రం నరేష్ వేములవాడ వెళ్లాడు. సోమవారం రాత్రి అక్కడే బస చేసి స్నేహితులతో కలిసి మద్యం సేవించి మంగళవారం ఉదయం మంచిర్యాలకు బయలు దేరాడని అదే క్రమంలో నరేష్ మిత్రుడైన మహేందర్ గౌడ్ నరేష్ భార్య స్రవంతికి ఫోన్ చేసి నరేష్ ఆసుప్రతిలో ఉన్నానని సమాచారం అందించాడు. దీంతో స్రవంతి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి చేరుకునేలోపు నరేష్ స్నేహితులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో స్రవంతి, తమ బంధువులు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని స్రవంతి, కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నరేష్ స్నేహితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని ఇన్‌చార్జి డీసీపీ వెల్లడించారు.
తన భర్తను స్నేహితులే హత్య చేశారంటూ నరేష్ భార్య స్రవంతి, కుటుంబ సభ్యులు ఇన్‌చార్జి డీసీపీ ముందు బోరున విలపించారు. తాను ఊరు వెళ్తున్నాని చెప్పిన తన భర్త చివరకు శవమై కనిపించాడని బోరున విలపించింది. తాను ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతినని, తన పరిస్థితి ఏమిటని పోలీస్ అధికారులను, తల్లిదండ్రులను ప్రశ్నించింది.
నరేష్ స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహించి పూర్తి నిజానిజాలను త్వరలోనే వెల్లడిస్తామని ఇన్‌చార్జి డీసీపీ విజయేందర్ రెడ్డి తెలిపారు. నరేష్ స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం తాగిన మైకంలో లేదా, ఏదైనా జరిగి మృతి చెందాడా అనే విషయం విచారణలో తేలుతుందని పెద్దపల్లి డీసీపీ విజయేందర్ రెడ్డి తెలిపారు.

చిత్రం.. మృతి చెందిన తాండూర్ మండలంలోని కొత్తపల్లి సర్పంచ్ నరేష్