తెలంగాణ

యాసంగిలో ఆరుతడి పంటలు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, డిసెంబర్ 19: నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు ప్రాంతం, ఎత్తిపోతల పథకాల కింద యాసంగిలో ఆరుతడి పంటలనే రైతులు సేద్యం చేసుకోవాలని ఎన్‌ఎస్‌ఎల్‌బీసీ ఓ అండ్ ఎం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ నర్సింహా కోరారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని సర్కిల్ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ సర్కిల్‌లోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఆయకట్టుకు 25 టీఎంసీల నీటిని సేద్యం కోసం కేటాయించామన్నారు. కేటాయించిన నీరు ఆరుతడి పంటలకే సరిపోతుందన్నారు. రైతులు అత్యధికంగా వరి పండించేందుకు మొగ్గు చూపుతున్నారన్నారని, దీనివల్ల నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
సర్కిల్ పరిధిలోని ఆయకట్టు, లిఫ్టుల కింద సుమారు 3,80,481 ఎకరాల స్థిరీకరించిన ఆయకట్టు ఉందని, అందులో 2.6 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందించే అవకాశం ఉందన్నారు. డిసెంబర్ 11నుండి 2018 ఏప్రిల్ 5 వరకు 8 తడులు 75 రోజులు 25 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన ఆరుతడి పంటలకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నందున రైతులు గమనించి పంటలు సేద్యం చేసుకోవాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా రైతులు వరి పంట సేద్యం చేసినట్లయితే పంట చేతికందే దశలో నీరందక నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఆయకట్టు చివరి భూములకు నీరందించేందుకు గాను నీటి పారుదల శాఖ అధికారులు చేపట్టే టెయిల్ టు హెడ్ పద్ధతికి సహకరించాలని అన్నారు. ఆయకట్టు పరిధిలో బోరు బావుల ద్వారా పంటను సేద్యం చేసుకుంటున్న రైతులు ఆ నీటిని వినియోగించుకోని సాగర్ నీటి జలాలను వృధా చేయవద్దని అన్నారు.
కాల్వ షట్టర్లను ధ్వంసం చేయడం కాని, కాల్వలకు గండ్లు పెట్టడం వంటివి చేయవద్దని ఆయన కోరారు. సాగు నీటి సమస్య తలెత్తినట్లయితే సంబందిత ఎఈలను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో ఈఈ నాగేశ్వరరావు, ఏటీఓ ధనుంజయ పాల్గొన్నారు.