తెలంగాణ

ఉద్యమం వెనక ఎవరూ లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు,డిసెంబర్ 19: ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలన్న తమ ఉద్యమంలో మావోయిస్టుల మద్దతు ఉందని దుష్ప్రచారం చేయడం తగదని, తమ ఉద్యమం వెనక ఎవరూ లేరని ఆదివాసి హక్కుల పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు ఆత్రం తిరుపతి తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధంగా ఎస్టీ జాబితాలోకి వచ్చిన లంబాడీల వల్ల తమకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందని, అన్యాయాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతోనే ఆదివాసీ గిరిజనులంతా స్వచ్ఛందంగా పోరుబాట పట్టారని అన్నారు. ఉద్యమాన్ని అణచడానికి తమ వెనక అదృశ్యశక్తులు ఉన్నాయని ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. గ్రామగ్రామాన ఆదివాసి గిరిజనులు స్వచ్ఛందంగా తమ సొంత ఖర్చులతో ఉద్యమాల్లోకి వస్తున్నారని, తమకు ఎవరు కూడా ఆర్థిక సాయం చేయడం లేదన్నారు. ముఖ్యంగా ఆదివాసి గిరిజన యువకులు తమ ఉపాధి ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న బాధతోనే ముందుకు వస్తున్నారని అన్నారు. రాజ్యాంగ బద్ధంగా హక్కుల సాధన కోసం జరుగుతున్న పోరాటాలను ఆపేది లేదని స్పష్టం చేశారు.