తెలంగాణ

రజాకార్ల వారసత్వ సంస్థ ఎంఐఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 19: ఎంఐఎం రజాకార్ల వారసత్వ సంస్థ అని, టెర్రరిస్టుల రక్షణ కవచమని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు ఆరోపించారు. నైజాం రజకార్ల వారసత్వంతో ఆవిర్భవించిన ఎంఐఎంతో ముస్లిం మహిళలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. మంగళవారం కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ చట్టానికి అడ్డుపడుతూ, వారినోట్లో మట్టికొట్టే యత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ముస్లిం మహిళల సమానత్వం, సాధికారతకు సంబంధించిన అంశం ట్రిపుల్ తలాక్‌పై సుప్రీం కోర్టు చట్టం చేయాలనే ఆదేశాల మేరకే కేంద్రం బిల్లు ప్రవేశపెట్టబోతోందని స్పష్టం చేశారు. ముస్లిం మహిళలకు లాభం చేకూర్చటంలో బీజేపీ కీలకంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్‌కు స్థానం లేదని, కాంగ్రేస్ పార్టీకి ఉన్న అవలక్షణాలన్ని టీఆర్‌ఎస్ పార్టీకి ఉన్నాయని, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ఒకే వ్యూహం, ఒకే పాలసీ, ఒకే విధానంతో ముందుకు వెళ్తున్నాయని, కుటుంబ పాలన, కుల, ఓటు బ్యాంకు రాజకీయాలను ఈ రెండు పార్టీలు ప్రోత్సహిస్తున్నాయని దుమ్మెత్తారు. కుటుంబ పాలనతో తెలంగాణ సతమతమవుతోందని, రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని, యువతకు ఉపాధి కరువై, బడుగు, బలహీన వర్గాలకు ఇప్పటికీ ఇళ్ళు నిర్మించకపోవడం శోచనీయమని అన్నారు. అవినీతి రహిత పాలనే గుజరాత్‌లో బీజేపీని వరుసగా ఆరోసారి గెలిపించిందని అన్నారు. రోజుకో రాష్ట్రంలో బీజేపీ గెలుపు దేశాభివృద్ధికి సంకేతమని, ఈ విజయపరంపర అప్రతిహతంగా కొనసాగతుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ముక్త్ భారత్‌లో భాగంగా ఈ నెల 18నాటి ఎన్నికల ఫలితాలతో బీజేపీ మరో అడుగు ముందుకేసిందని తెలిపారు. రాబోయే రోజుల్లో దక్షిణ భారతంలోని కర్ణాటకతోపాటు తెలంగాణలో కూడా కమలం పువ్వు వికసించబోతోందని జోస్యం చెప్పారు. రెండు ముఖ్యమైన అజెండాలతో తమ పార్టీ ముందుకువెళ్తోందని, ఇందులో భాగంగానే అభివృద్ధి, సుపరిపాలన, అవినీతి రహిత రాజకీయాల దిశగా పయనిస్తున్నట్లు వెల్లడించారు. సంకుచిత కుల రాజకీయాలకు చరమగీతం పాడేందుకు తమ పార్టీ కంకణం కట్టుకుందన్నారు. దేశ వ్యాప్తంగా విస్తరించిన ఈ జాడ్యాన్ని రూపుమాపుతున్న క్రమంలోనే హిమాచల్‌ప్రదేశ్ ప్రజలు తమను ఆదరించారని తెలిపారు. కుల, మత ప్రాతిపదికన ఓటు బ్యాంకు రాజకీయాలకు అంతం పలికి, సమైక్య భారత్‌ను అభివృద్ధి దిశగా తీసుకెళ్ళేందుకు భాజపా నడుం బిగించిందని చెప్పారు. 2019 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా దక్షిణ భారతదేశం కీలకం కాబోతోందని, మార్పు రాజకీయాలకు వేదికగా మారబోతోందని తెలిపారు. ప్రధానంగా తెలంగాణలో ఇది సుస్పష్టం కాబోతుందని చెప్పారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు గాజుల స్వప్న, కొట్టె మురళీకృష్ణ, పెండ్యాల సాయికృష్ణారెడ్డి, హరికుమార్‌గౌడ్, మేకల ప్రభాకర్‌యాదవ్, కనె్నబోయిన ఓదెలు, రాంరెడ్డి, శ్రీ్ధర్‌రావు, కరండ్ల మధుకర్, పోతుగంటి సుజాత, సుంకపాక విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..కరీంనగర్‌లో మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు