తెలంగాణ

తెలంగాణ సహకార వ్యవస్థ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 20: దేశానికి అన్నదాతలైన రైతుల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న సహకార వ్యవస్థ తెలంగాణలో భేషుగ్గా ఉందని ఉత్తరాఖండ్ మంత్రి ధన్‌సింగ్ రావత్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో సహకార బ్యాంకుల కంప్యూటరీకరణ విధానంపై అధ్యయనం చేసేందుకు వచ్చిన ఆయన గట్టుదుద్దెనపల్లి, కరీంనగర్ సహకార సంఘాల్లోని కంప్యూటర్ల పనితీరును బుధవారం పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, కంప్యూటీకరణతో రైతులకు పారదర్శకమైన సేవలు, నిర్ణీత గడువులోగా అందించవచ్చని అన్నారు. సహకార బ్యాంకుల ద్వారా జిల్లావ్యాప్తంగా రైతులకు రుణ సదుపాయంతో పాటు, ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడం, ధాన్యం, మక్కలు కొనుగోలు చేస్తూ, మిల్లింగ్ చేయడం కూడా రైతులకు ఎంతగానో లాభం చేకూర్చుతూ, వారి అభివృద్ధికి పాటుపడుతుండడం అభినందనీయమన్నారు. వ్యవసాయాన్ని ఎంత అభివృద్ధి చేస్తే, నిరుద్యోగాన్ని అంత నిర్మూలించవచ్చని, తమ రాష్ట్రంలో అంతంత మాత్రంగానే ఉన్న సాగును విస్తృతపరిచే క్రమంలోనే సహకార రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రైతు కుటుంబాలకు విద్య, వైద్య, సాగు రుణాలు తక్కువ వడ్డీకే అందిస్తున్నట్లు, వ్యాపార, వాణిజ్య విధానాన్ని, సహకార బ్యాంకుల్లో తగ్గించి, చిత్తశుద్ధితో సేవాభావంతోపని చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి గ్రామంలో 20నుంచి 30 మందితో కలిపి రైతు సంఘాలు ఏర్పాటు చేసి, ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ అనుబంధ పథకాలు నేరుగా సంఘాలకు చేరవేస్తుండగా, నిరుద్యోగులు సైతం వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకుని, సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు. అంతరించిపోతున్న కులవృత్తులను ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ మాదిరి తమ రాష్ట్రంలో కూడా పలు ఫెడరేషన్లు ఏర్పాటు చేసి, యువతకు పనిముట్లు పంపిణీ చేస్తూ, రుణ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేడీసీసీబీ పనితీరును తెలుసుకున్న ఆయన పాలకవర్గాన్ని, బ్యాంకు సిబ్బందిని ప్రశంసించారు.