తెలంగాణ

నల్లగొండ మున్సిపాల్టీకి జాతీయ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 20: నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మిశ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వ పురస్కారం స్కోచ్ అవార్డును అందుకున్నారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిత్రారామచంద్రన్ చేతుల మీదుగా చైర్‌పర్సన్ లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు స్కోచ్ అవార్డును స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ఆస్తి పన్ను మదింపు కోసం నల్లగొండ మున్సిపాల్టీ జీఐఎస్ సర్వే చేపట్టింది. ఈ సర్వేకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించగా మున్సిపాల్టీకి స్కోచ్-2017 అవార్డు వరించింది. జాతీయ స్థాయిలో నల్లగొండ మున్సిపాల్టీ స్కోచ్ అవార్డు పొందడం పట్ల పాలకవర్గంలో, మున్సిపల్ సిబ్బందిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.