తెలంగాణ
రాష్ట్ర ప్రగతికి ఎన్ఆర్ఐల చేయూత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గజ్వేల్, డిసెంబర్ 20: తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి ఎన్ఆర్ఐల చేయూత ఉటుందని, సీఎం కేసీఆర్ కృషి ఫలితంగానే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నట్లు ప్రపంచ తెలుగుమహా సభల ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్‌బిగాల పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కోమటిబండ మిషన్‌భగీరథ ప్రాజెక్టు, గజ్వేల్‌లోని ఎడ్యుకేషన్‌హబ్, సంగాపూర్, ఎర్రవల్లిలలోని డబుల్బెడ్రూం ఇళ్ల్ల నిర్మాణాలను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ దేశంలోని ఏ రాష్ట్రానికీ తీసిపోని విధంగా అభివృద్ధిలో పరుగులు పెడుతోందని, అలాగే చైనాకు దీటుగా భారత్ రూపుదిద్దుకుంటుండడం హర్షణీయమని స్పష్టం చేశారు. మిషన్‌భగీరథ పథకం, టీఎస్ఐపాస్, కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిని వివరించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు నందిస్తామని తెలిపారు. అంతేగాకుండా సీఎం కేసీఆర్ కృషి ఫలితంగానే ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతంకాగా, తెలుగు పౌరుడిగా తాను గర్వపడుతున్నట్లు వివరించారు.