తెలంగాణ

వదంతులతో తప్పుదోవ పట్టించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,డిసెంబర్ 20: ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి అశాంతిని ప్రేరేపించేందుకు కొన్ని శక్తులు వదంతులు, పుకార్లతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని, వీరి మాటలు నమ్మకుండా ఇరువర్గాల ప్రజలు సంయమనం పాటించాలని వరంగల్ జోన్ ఐజీ వై.నాగిరెడ్డి సూచించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గిరిజన వర్గాల మధ్య నెలకొన్న వైరుధ్యాల నేపథ్యంలో బుధవారం ఉట్నూరు డీఎస్పీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో శాంతి భద్రతల సమస్య, పోలీసుల కార్యాచరణ ప్రణాళిక అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు మిత్రులేనని, రాత్రి పగలు కష్టపడి విధులు నిర్వర్తిస్తారని, వారి పట్ల ప్రజలు స్నేహభావంతో మెలగాలని అన్నారు.
సుఖశాంతులతో ప్రజలు జీవించాలంటే శాంతిభద్రతలు పటిష్టంగా ఉండాలని, ఇందుకు పోలీసుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రజల మనోభావాలను తెలుసుకొని శాంతియుత వాతావరణం కోసం పోలీసులు నిరంతరం ప్రయత్నాలు సాగిస్తున్నారని, అయితే జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితి క్రమంగా సడలిపోతోందని అన్నారు. వదంతులతో పోలీసులను సైతం తప్పుదోవ పట్టిస్తే ఇంకా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలీసుల విధులను బాధ్యతలను పెద్ద మనుసుతో అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన ఘనత పోలీసులకే ఉందని, ఈ విషయంలో ఏమాత్రం ఆసాంఘిక శక్తులు ప్రవేశించినా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
గిరిజన సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి ప్రజలచెంత ఉంటూ చర్యలు చేపడుతుందన్నారు. ఇప్పటికే ఏజెన్సీ గ్రామాల్లో విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని, దాన్ని పునరుద్ధరించేందుకు తల్లిదండ్రులు ముందుండి సహకరించాలన్నారు. గిరిజన సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని, హింసాత్మక సంఘటనలతో సాధించేది ఏమీ ఉండదని స్పష్టం చేశారు. పోలీసు అధికారులు గ్రామాల్లో సందర్శిస్తే ప్రజలతో మమేకం కావాలని, వారి కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. చలి తీవ్రతను లెక్కచేయకుండా మూడు వేల మంది పోలీసులు విధుల్లో కొనసాగుతున్నారని, ఉన్నతాధికారులు సైతం మారుమూల గ్రామాల్లో మకాం వేసి భద్రత చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత సమయంలో విద్యా వ్యవస్థను పునరుద్ధరించడమే కీలక అంశంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రేంజ్ డీఐజీ టి.ప్రమోద్‌కుమార్, నిజామాబాద్ కమిషనర్ కార్తికేయ, కరీంనగర్ కమిషనర్ కమలాకర్ రెడ్డి, రామగుండం కమిషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్, ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, మంచిర్యాల డీసీపీ వేణుగోపాల రావు తదితరులు పాల్గొన్నారు.