తెలంగాణ

బోధనేతర సిబ్బంది సేవలను కొనసాగించండి: హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను కొనసాగిస్తూ వారి సేవలను క్రమబద్ధీకరించే విషయమై పరిశీలించాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. రెండు రాష్ట్రాల్లో 748 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు విచారించారు. తమ సర్వీసులను టర్మినేట్ చేస్తున్నట్లు తమకు అవసరమైన విద్యార్హతలులేవంటూ రెండు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని పిటిషనర్లు సవాలు చేశారు. కాగా పనిచేస్తున్న సిబ్బందిలో కామర్స్ డిగ్రీ లేనివారు ఉన్నారని, వారికి బుక్ కీపింగ్ పద్ధతులు తెలియవని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఈవిద్యాలయాల్లో అర్హత ఉన్న మహిళలను బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల్లో కొనసాగించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కేంద్రం కూడా ఈ విద్యాలయాల్లో మహిళలనే ఉద్యోగులుగా కొనసాగించాలని ఆదేశించినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ విద్యాలయాల్లో పురుష సిబ్బంది నివసించేందుకు వీలు లేదని, బాలికలు ఉన్న గదుల్లోకి అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. భవిష్యత్తులో ఈ విద్యాలయాల్లో ఖాళీలు ఏర్పడితే, మహిళలతో భర్తీ చేయవచ్చని హైకోర్టు పేర్కొంది.