తెలంగాణ

మున్సిపల్ శాఖకు రెండు స్కోచ్ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: రాష్ట్రంలోని 72 పట్టణాల్లో 12 లక్షల భవనాలను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు భూ ఉపరితలం నుంచి తీసిన చిత్రాలను ఆస్తిపన్ను ఖాతాలతో అనుసంధానం చేయడంతో తెలంగాణ మున్సిపల్ శాఖ రెండు స్కోచ్ గోల్డ్ అవార్డులను గెలుచుకుంది. భారత ప్రభుత్వ నేషనల్ రిమోట్ సెన్సింగ్ భాగస్వామ్యంతో ‘్భవన్’ ఉపగ్రహం సహాయంతో భవనాల చిత్రాలను తీసి జియో ట్యాగింగ్ చేసింది. దీనికి సదరు భవనానికి మదింపు చేసిన ఆస్తిపన్ను ఖాతా నంబర్‌కు అనుసంధానం చేసింది. దీని వల్ల భవన విస్తీర్ణం మేరకు ఆస్తిపన్ను మదింపు జరిగిందా? లేదా తెలుసుకోవడానికి ఈ పద్ధతిని మున్సిపల్ శాఖ అనుసరించింది. ఈ విధానం ద్వారా అనుమతి లేకుండా నిర్మించే భవనాల సమాచారం కూడా తెలిసిపోతుంది. ఈ విధానాన్ని దేశంలోనే మొట్ట మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టింది. సులభ వ్యాపార విధానంలో (ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) రాష్ట్ర ప్రభుత్వం ర్యాంక్ సాధించడానికి కూడా ఇది దోహదం చేస్తుందని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ టికె శ్రీదేవి అన్నారు. ఈ మేరకు తెలంగాణ మున్సిపల్‌శాఖకు వచ్చిన అవార్డులను ఢిల్లీలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీదేవి అందుకున్నారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో ఆస్తిపన్ను ఖాతా, పన్ను చెల్లించని 20 వేల చిలుకు భవనాలను గుర్తించినట్టు శ్రీదేవి తెలిపారు. భూ ఉపరితల చిత్రాల ద్వారా ఒక ఆస్తిపన్ను మాత్రమే కాకుండా అనధికార నల్లా కనెక్షన్లను కూడా గుర్తించడానికి అవకాశం కలిగిందన్నారు. భూపరితల ఆధారిత సాంకేతిక వ్యవస్థను ప్రయోగాత్మకంగా ఉపయోగించి నల్లగొండ పట్టణంలో సర్వే చేయగా ప్రస్తుతం ఉన్న ఆస్తిపన్ను రాబడి రెట్టింపు అయిందన్నారు. భవన యజమానుల వివరాలను వారి ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయడం ద్వారా మున్సిపల్ రికార్డుల ప్రక్షాళన వంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఈ సర్వే విజయవంతం కావడంతో రాష్టవ్య్రాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నట్టు ఒక ప్రకటనలో డైరెక్టర్ శ్రీదేవి వివరించారు.