తెలంగాణ

విదేశీ నిధులు నేరుగా సేకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు విదేశాల నుంచి నేరుగా నిధుల సమీకరణకు వెసులుబాటు కల్పించాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీ రామారావు విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం ఇక్కడ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సురేశ్ ప్రభులను కలిసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. విదేశీ సంస్థల నుంచి నేరుగా నిధులు సమీకరించుకునేలా అవకాశం కల్పించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సురేశ్ ప్రభును కలిసిన సందర్భంగా తెలంగాణలో ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్’ (ఎన్‌ఐడీ)ను నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సందర్భంలో నిజామాబాద్ ఎంపీ కవిత పసుపు బోర్డు ఏర్పాటుపై వీలైనంత త్వరగా నిర్ణయం ప్రకటించాలని సురేశ్ ప్రభుకి విజ్ఞప్తి చేశారు. మంత్రి కేటీఆర్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, సీఈవో అమితాబ్ కాంత్‌ను కూడా కలిశారు.