తెలంగాణ

సానుకూల దృక్పథం అలవరచుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: పిల్లలు చిన్నతనం నుండి సానుకూల దృక్పథం అలవరచుకోవాలని భారత రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్ ఉద్బోధించారు. బుధవారం నాడు సోమాజీగూడలోని రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలను రాష్టప్రతి సందర్శించారు. రాష్టప్రతి వెంట గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి , విద్యాశాఖ సీనియర్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాటించాల్సిన కొన్ని ముఖ్య సూత్రాలను వివరిస్తూ, సానుకూల దృక్పథం కొరవడితే ఎల్లపుడు ఆటంకాలు ఎదురై అనుకున్న గమ్యాలను చేరుకోలేరని అన్నారు.
అందువల్ల సానుకూలతతోనే జీవితంలో ముందుకు పోవాలని సూచించారు. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ఎప్పుడూ దగ్గరదారి చూసుకోరాదని, వాటివల్ల సత్ఫలితాలుండకపోగా, దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంటుందని అన్నారు. విద్యార్థులు జీవితంలో పైకి ఎదగాలంటే కష్టపడాలని, నిరంతర శ్రమకు మించిన ప్రత్యామ్నాయం ఏదీ లేదని అన్నారు. అవకాశాలు ఎపుడూ నిజాయితీగా పనిచేసేవారికే వరిస్తాయని చెప్పారు. అందుకే దివంగత రాష్టప్రతి అబ్దుల్ కలాం ఉన్నత విద్యకు ఎంతగా పరిశ్రమించారో , ఆయన ఎంచుకున్న మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించడంతో పాటు తమను శిఖరాగ్రాలకు చేర్చడంలో సహకరించిన సమాజానికి చేతనైనంత రీతిలో సహాయపడాలని ప్రధానంగా జాతికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని అన్నారు.
మాతృ భాషను విస్మరించరాదని, అయితే విద్యార్థులు తెలుగు, ఇంగ్లీషుతో పాటు హిందీ భాషను కూడా నేర్చుకోవాలని అన్నారు. రాజ్‌భవన్ పాఠశాలలో ఇ- లైబ్రరీ, డిజిటల్ తరగతులు వంటి సౌకర్యాలు, విద్యార్థులకు అందుతున్న ఉచిత పుస్తకాలు, యూనిఫారం వంటి రాయితీలను తెలరసుకుని అభినందించారు. దేశంలో మరే ప్రభుత్వ పాఠశాలలో ఇన్ని సౌకర్యాలు లేవని ఈ పాఠశాల విద్యార్థులందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆచార్య, ముఖ్యకార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, జిఎడి ప్రత్యేక కార్యదర్శి అదర్‌సిన్హా, కార్యదర్శి అర్జునరావు, విద్యాశాఖ కమిషనర్ కిషన్, కలెక్టర్ యోగితారాణా, విద్యాశాఖ జెడి రమేష్, డిఇఓ సత్యనారాయణ రెడ్డి, హెడ్మాస్టర్ మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు దేశ ప్రధమ పౌరుడిని ఉద్ధేశించి ఆలాపించిన ప్రత్యేక గీతం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది.

బుద్ధ విగ్రహాన్ని సందర్శించిన రాష్టప్రతి

హైదరాబాద్, డిసెంబర్ 20: భారత రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్ బుధవారం నాడు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధవిగ్రహాన్ని సందర్శించారు. దేశంలో ఎక్కడా లేని అపురూపమైన బుద్ధవిగ్రహాన్ని రాష్టప్రతి సందర్శించడంతో హుస్సేన్‌సాగర్‌లో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. బోట్లలో భద్రతా సిబ్బంది పహరా కాస్తుండగా, ప్రత్యేక బోటులో రాష్టప్రతి బుద్ధవిగ్రహాన్ని సందర్శించారు. ప్రపంచంలోనే ఎతె్తైన ఏకశిలా బుద్ధవిగ్రహం ప్రత్యేకతలను అధికారులు రాష్టప్రతికి వివరించారు. హుస్సేన్‌సాగర్‌లో ఏర్పాటు చేసిన జిబ్రాల్టర్ రాక్ రాతిపై బుద్ధ విగ్రహాన్ని అమర్చిన తీరును వారు చెప్పారు. ఒకే రాతితో 17.5 అడుల ఎత్తు, 350 టన్నుల బరువుండే బుద్ధ విగ్రహ ప్రత్యేకతలను ఏర్పాటు చేసిన తీరు చూసి రాష్టప్రతి మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా రాష్టప్రతి బుద్ధ విగ్రహం వద్ద పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
రాష్టప్రతికి ఘనవీడ్కోలు
ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో మంగళవారం నాడు హైదరాబాద్ వచ్చిన రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్ బుధవారం మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ సందర్భంగా రాష్టప్రతికి బేగంపేట విమానాశ్రయంలో ఘన వీడ్కోలు పలికారు. రాష్టప్రతికి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఉప ముఖ్యమంత్రులు మొహమ్మద్ అలీ, కడియం శ్రీహరి, శాసనమండలి చైర్మన్ కె స్వామిగౌడ్, స్పీకర్ మధుసూధనాచారి, మేయర్ బొంతు రామమోహన్ వీడ్కోలు పలికారు. వీడ్కోలు పలికిన వారిలో మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలు, ప్రోటోకాల్ అధికారులతో పాటు సీనియర్ పోలీసు అధికారులు, ఐఎఎస్ అధికారులున్నారు.