తెలంగాణ

క్రిస్మస్ విందుకు రూ.15 కోట్లు రేపు జరిగే విందుకు సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: క్రిస్మస్ పండుగ సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిజాం కాలేజీ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున విందు ఏర్పాటు చేసినట్టు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఈ విందుకు సీఎం హాజరవుతారని చెప్పారు. క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం రూ. 15 కోట్లు కేటాయించిందని తెలిపారు. నిజాం కాలేజీ మైదానంలో విందు ఏర్పాట్లను బుధవారం ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణ కోసం పట్టణ ప్రాంతాల్లోని 213 చర్చీలకు రూ. లక్ష రూపాయల చొప్పునా, గ్రామీణ ప్రాంతాల్లోని 95 చర్చీలకు రూ. 2 లక్షల చొప్పున కేటాయించినట్టు వివరించారు. రంజాన్, బోనాలు, బతుకమ్మ పండుగలకు ఇచ్చినట్టుగానే క్రిస్మస్‌కు నిధులు ఇచ్చామన్నారు.

ప్రణబ్‌తో పొన్నాల భేటీ

న్యూఢిల్లీ,డిసెంబర్ 20: తెలంగాణ పి.సి.సి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బుధవారం ఇక్కడ మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దేశంతోపాటు తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి ప్రణబ్ ముఖర్జీతో తాను చర్చించినట్లు పొన్నాల విలేఖరులతో చెప్పారు.