తెలంగాణ

శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

/దిల్‌సుఖ్‌నగర్, డిసెంబర్ 20: నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి తీసుకువచ్చి నగరంలో శిశువులను విక్రయిస్తున్న ముఠాను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. బాలల హక్కుల సంఘం అధికారులు, రాచకొండ ఎస్‌వోటీ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో ఆరుగురు ముఠా సభ్యులు పట్టుబడ్డారు. మరో ఇద్దరు పరార్ కాగా, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్టు రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు నుంచి ఒక ఆడ శిశువును నగరానికి తీసుకువచ్చిన ముఠా సరూర్‌నగర్‌లో ఓ వ్యిక్తికి రూ. 80 వేలకు విక్రయిస్తుండగా ఎస్‌వోటీ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించగా గతంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల ట్రైబల్ ఏరియా నుంచి పసికందులను తీసుకువచ్చి విక్రయించినట్టు పోలీసుల విచారణలో తేలినట్టు తెలిసింది. బుధవారం సరూర్‌నగర్‌లో ఓ పసికందును ఓ దంపతుల నుంచి రూ. 15 వేలకు కొనుగోలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్ మెహిదీపట్నం, నాగోలులో కూడా పసిపిల్లల విక్రయాలు జరిగాయి. సంతానం లేనివారికి ఈ ముఠా పసిపిల్లలను విక్రయిస్తున్నట్టు సమాచారం. అరెస్టయిన వారిలో కడ్తాల్ మండలం వాసుదేవపూర్ తాండాకు చెందిన కేదావత్ రవి (32) కేదావత్ సరోజ (28) విదిత్యావత్ రువ్యా (45) ముడావత్ అక్ష్మణ్ (50) కేతావత్ పంటూ (40) వరిత్యావత్ రెడ్యా (45) ఉన్నారు. వీరంతా ఒ ముఠాగా ఏర్పడి చిన్న ఆడపిల్లల గృహిణులను టార్గెట్ చేసుకుని పిల్లలను విక్రయించడం ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ఈ క్రమంలో వెల్డండ మండలం రాచూర్ తాండకు చెందిన ఒ దంపతుల వద్ద నుంచి వారం రోజుల ఓ చిన్నారిని 15 వేల రూపాయలకు కొనుగోలు చేసి నగరానికి తీసుకువచ్చి 80 వేలకు విక్రయించేందుకు సరూర్‌నగర్ వెంకటేశ్వర కాలనీకి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఎవరికైతే ముగ్గురు ఆడ పిల్లలు సంతానం ఉంటుందో వారిని సంప్రదిస్తారు. డబ్బులు ఎర చూపి పిల్లల క్రయవిక్రయాలు జరుపుతుంటారని పోలీసులు తెలిపారు.