తెలంగాణ

రూ.3.4కోట్లతో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కార్యాలయాలకు సోలార్ విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: మెదక్, నల్గొండ జిల్లాల్లో ఉన్న తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కార్యాలయాలు, సబ్ స్టేషన్లకు భవనం పైభాగాన సౌరవిద్యుత్ ఉత్పత్తయ్యే యూనిట్లను ఏర్పాటు చేసే ఆర్డర్‌ను హైదరాబాద్‌కి చెందిన ఫ్రేయర్ ఎనర్జీ కంపెనీ దక్కించుకుంది. రూ.3.4 కోట్లతో చేపట్టే ఈ సోలార్ కాంట్రాక్ట్ 12 నెలల్లో పూర్తి చేయాల్సి ఉందని ఫ్రేయర్ ఎనర్జీ సహ వ్యవస్ధాపకుడు సౌరభ్ మర్దా తెలిపారు. మెదక్‌లో 300 కెడబ్ల్యూపి, నల్గొండలో 290కెడబ్ల్యూపి ఉత్పాదక సామర్ధ్యంతో కూడిన యూనిట్లు ఏర్పాటు చేయాలని ఒప్పందం కుదిరిందని తెలిపారు. నాలుగు కంపెనీలు ఈ కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు పోటీపడగా, తమ సంస్థ చివరిగా దక్కించుకుందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం 2015 సోలార్ పవర్ పాలసీని ప్రకటించిన తర్వాత గ్రిడ్ సామర్ధ్యం పెరగడమే కాకుండా ప్రైవేట్, పబ్లిక్ పెట్టుబడులు పెరిగాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు తమ సంస్థ 5.5 మెగావాట్ల సామర్ధ్యంతో కూడిన సోలర్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేశామని, ఇంకా కొన్ని ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.