తెలంగాణ

ప్రపంచ తెలుగు మహాసభలతో వెలుగులోకి తెలంగాణ ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: తెలంగాణ కవులు, రచయితలు, కళాకారుల ప్రతిభ ప్రపంచ తెలుగు మహాసభలతో వెలుగులోకి వచ్చిందని రాష్ట్ర సాహితీ అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గురువారం ఇక్కడ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ తెలుగు మహాసభలు దిగ్విజయంగా పూర్తయ్యాయని, ఇందుకోసం ప్రింట్ మీడియాతో పాటు ఎలక్రానిక్ పూర్తిగా సహరించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సభలను మీడియా కూడా ‘మన సభలు’ అనుకోవడం వల్లనే విస్తృతమైన ప్రచారం వచ్చిందన్నారు. మీడియా సహకారం లేకపోతే ఈ సభలు ఇంత ఘనవిజయం సాధించేవి కావన్నారు.
ప్రపంచ తెలుగు మహాసభలతో సాహిత్య వికాసానికి బాటలు వేసినట్టయిందన్నారు. వివిధ వేదికల నుండి మాట్లాడిన వక్తల ప్రసంగాలు, కార్యక్రమాల వివరాలను క్రోఢీకరించి పూర్తి వివరాలతో ఒక పుస్తకం తీసుకువస్తామని సిధారెడ్డి తదితరులు తెలిపారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల వీడియోలను క్రోఢీకరించి సమగ్రమైన ఒక సిడిని రూపొందిస్తామని వివరించారు.ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆలోచనల మేరకు సభల ప్రణాళిలను రూపొందించి అమలు చేశామన్నారు. వీలైనంత వరకు ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూశామన్నారు. ఇంత పెద్ద ఎత్తున సభలు జరగడంతో అక్కడక్కడా చిన్న చిన్న లోపాలు కూడా జరిగాయని, ఈ లోపాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తుకు బాటలు వేస్తామన్నారు. సభల నిర్వహణలో దేశ, విదేశ ప్రతినిధులంతా సంతృప్తి వ్యక్తం చేశారని, పండితులు తదితరులు సభల నిర్వహణపై ప్రశంసల వర్షం కురిపించారన్నారు. ‘అక్షరానికి’ పట్ట్భాషేకం జరిగిందని, మంచి ఆతిథ్యం ఇవ్వగలిగామని, అందరూ ఆనందపడ్డారన్నారు. సాహిత్య అకాడమీ నేతృత్వంలో ఒక త్రైమాసిక సాహితీ పత్రికను తీసుకురావాలని ఆలోచిస్తున్నామని, ఏడాది తర్వాత దీన్ని ద్వైమాసిక పత్రికగా రూపుదిద్దుతామన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు గద్దర్‌తో సహా కొంత మందిని పిలవలేదన్న వచ్చిన ఆరోపణలను సిధారెడ్డి తదితరులు తోసిపుచ్చారు. అందరినీ రమ్మన్నామన్నారు. అభిప్రాయ బేధం ఉన్న కొందరు హాజరు కాకపోయి ఉండవచ్చన్నారు.