తెలంగాణ

సైన్స్ కాంగ్రెస్ నిరవధిక వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: వచ్చే నెల 3వ తేదీ నుండి ఉస్మానియా యూనివర్శిటీలో జరగాల్సిన 105వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ నిరవధికంగా వాయిదా పడినట్టు సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ గురువారం నాడు ప్రకటించింది. సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రొఫెసర్ అచ్యుత సామంత వ్యవహరిస్తుండగా, సహ అధ్యక్షుడిగా ఉస్మానియా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం వ్యవహరిస్తున్నారు. జనవరి 3వ తేదీ నుండి జరగాల్సిన సైన్స్ కాంగ్రెస్‌కు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరుకావల్సి ఉంది. ఈ సమ్మేళనానికి అనేక మంది నోబెల్ బహుమతి గ్రహీతలు, దేశ విదేశాల నుండి శాస్తవ్రేత్తలు, సైన్స్ పరిశోధకులు, సైన్స్ బోథకులు హాజరుకావల్సి ఉంది. ఇందుకోసం ఉస్మానియా యూనివర్శిటీ గత మూడు నెలలుగా అనేక కమిటీలను వేసి నిర్వహణకు సన్నద్ధమైంది. అయితే ఇటీవల యూనివర్శిటీలో జరుగుతున్న విద్యార్థి ఉద్యమాలు చిలికి చిలికి గాలివానగా మారి ఉద్ధృతం కావడంతో యూనివర్శిటీ ప్రాంగణంలో సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ తలనొప్పి కానుందని భావించిన అసోసియేషన్ తొలుత ప్రారంభ కార్యక్రమాన్ని హైటెక్స్‌లో నిర్వహించి మిగిలిన అన్ని సదస్సులను యూనివర్శిటీ ప్రాంగణంలోనే నిర్వహించాలని భావించింది. అయితే ఏ దశలోనూ విద్యార్థులు వెనక్కు తగ్గకపోవడం, వేర్వేరు పేర్లతో రోజుకో ఉద్యమం చెలరేగడంతో యూనివర్శిటీ క్యాంపస్‌లో సాధ్యమయ్యే పనికాదని తెల్చుకున్న సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సమ్మేళనాన్ని నిరవధికంగా వాయిదా వేసింది. ఈ మేరకు యూనివర్శిటీ ఒక ప్రకటన విడుదల చేయడంతో పాటు సైన్స్ కాంగ్రెస్ వెబ్ పోర్టల్‌లో ఒక ప్రకటన జారీ చేసింది. ఒక దశలో సైన్స్ కాంగ్రెస్ నిర్వహణను దృష్టిలో ఉంచుకుని పలు పరీక్షల షెడ్యూలును కూడా మార్చుకుంది. యూనివర్శిటీ ప్రాంగణం దాటి వేరే చోట సైన్స్ కాంగ్రెస్ నిర్వహణపై పిఎంఓ నుండి అభ్యంతరాలు సైతం వ్యక్తమైనట్టు తెలిసింది. గత 105 సైన్స్ కాంగ్రెస్ సమ్మేళనాలు యూనివర్శిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లోనే జరిగాయి. వీటిని కాదని హైటెక్స్‌లో నిర్వహిస్తామని చెప్పడం సరికాదని పిఎంఒ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. హైటెక్స్‌లో జనవరి 3 నుండి నిర్వహించేందుకు అక్కడ కూడా అనువుగా లేదని తేలడంతో అసోసియేషన్ నిరవధిక వాయిదా వేసింది.
దారుణం: ఔటా
సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు విశ్వవిద్యాలయం బాధ్యులు నిస్సహాయత వ్యక్తం చేయడం దారుణమని ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ బి సత్యనారాయణ విమర్శించారు. ఉస్మానియాకు ఉన్న మంచి పేరు ఇలాంటి నిర్ణయాల వద్ద పోతోందని వ్యాఖ్యానించారు.
సైన్స్ కాంగ్రెస్‌ను ఒయులోనే నిర్వహించాలని ఎబివిపి సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు మట్ట రాఘవేందర్ కోరారు. సైన్స్ కాంగ్రెస్ నిర్వహణలో విఫలమైన విసి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం ఒత్తిడితోనే నిరవధికంగా వాయిదా వేశారని, ప్రభుత్వం తీరు చూస్తుంటే ఉన్నత విద్యావిధానంపై ప్రభుత్వ వైఖరి అద్దం పడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేతిలో విసిలు కీలుబొమ్మగా మారారని, ఉస్మానియా ఖ్యాతి తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.